Breaking News: టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
రేపు నిర్మల్‌కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నిర్మల్ జిల్లాకు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ వరకూ వస్తారు. నాందేడ్ నుంచి హెలీకాప్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు.
మహిళా అధికారిణిపై దాడి
అటవీశాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేశారు. ఓ మహిళా అధికారిణిపై పెట్రోల్‌తో దాడి చేశారు. భూపాలపల్లి జిల్లా పంది పంపుల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.