MBBS Student: డాక్టర్ కావాలని లేదని కాలేజీలో చేరిన రోజే ఆత్మహత్య - నీట్ టాపర్ విషాదాంతం -అసలేం జరిగింది?
Do not Want To Be Doctor: డాక్టర్ కావాలని లేదని సూసైడ్ నోట్ రాసి మహారాష్ట్రలో 19 ఏళ్ల నీట్ టాపర్ MBBS అడ్మిషన్ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Teen Dies By Suicide On Day Of MBBS Admission: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నవర్గావ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి అనురాగ్ అనిల్ బోర్కర్, NEET UG 2025 పరీక్షలో 99.99 పర్సెంటైల్ సాధించాడు. OBC కేటగిరీలో అఖిల భారత స్థాయిలో 1475 ర్యాంక్ పొందాడు. MBBS సీటు సంపాదించాడు. కానీ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులు బలవంతంగా డాక్టర్ అవ్వమని ఒత్తిడి చేస్తున్నారని, తాను డాక్టర్ కావాలని లేదని బాధపడి అడ్మిషన్ కోసం వెళ్లాల్సిన రోజునే తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో "నాకు డాక్టర్ కావాలని లేదు.. తల్లిదండ్రులు నన్ను బలవంతం చేస్తున్నారు" అని రాశాడు.
సిందేవాహీ తాలూకా నవర్గావ్‌లోని ఒక సాధారణ కుటుంబంలో అనురాగ్ పెరిగాడు. NEET UG 2025 పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది. సెప్టెంబర్ 23న అతన్ని కుటుంబం ఆనందంగా, గోరఖ్‌పూర్‌కు పంపాలని ప్లాన్ చేసింది. ఉదయం 6 గంటల సమయంలో అతను తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గది తెరిచి చూసేసరికి విషాదం బయటపడింది. దగ్గర్లో ఉన్న టేబుల్ మీద సూసైడ్ నోట్ ఉంది నేను ఇలా చేయడం వల్ల మీరు బాధపడకూడదు... నా మరణం వల్ల మీరు గెలవాలని కోరుకుంటున్నాను అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
అనురాగ్ చంద్రాపూర్‌లోని స్థానిక కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, NEETకు సిద్ధమయ్యాడు. 2025 మేలో జరిగిన NEET UG పరీక్షలో 99.99 పర్సెంటైల్ సాధించి, OBC కేటగిరీలో అఖిల భారత ర్యాంక్ 1475 పొందాడు. ఈ స్కోర్‌తో అతనికి ఎంపీబీఏస్ సీటు సులభంగా దక్కింది. కానీ, అతను ఇంజనీరింగ్ లేదా ఇతర కోర్సులు చేయాలని కోరుకున్నాడు. తల్లిదండ్రులు "మా కలలు నీపై ఉన్నాయి, డాక్టర్ అవ్వాలి" అంటూ ఒత్తిడి చేశారని స్నేహితులు చెబుతున్నారు. ఇటీవలి రోజుల్లో అతను డిప్రెషన్‌లో ఉన్నాడని స్నేహితులు చెబుతున్నారు.
A 19-year-old from Maharashtra's Chandrapur died by su!cide on the very day of his MBBS admission, despite securing an impressive NEET score and and an AIR rank of 1,475. He was scheduled to travel to Uttar Pradesh's Gorakhpur for his admission at a medical college there. pic.twitter.com/QtOQKQUlIv
— Peek TV (@PeekTV_in) September 24, 2025
పోలీసులు సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్ల స్టేట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. 2025 NEET ఫలితాల తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో 10కి పైగా ఆత్మహత్యలు జరిగాయి. పరీక్షలో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా, అనుకున్న కాలేజ్‌లో సీట్ రాలేదనా – ఇలాంటి కారణాలతో చాలా మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా, తల్లిదండ్రులు, సమాజం ఆకాంక్షలు వల్ల టాపర్‌లు కూడా బాధపడుతున్నారు. NEET కౌన్సెలింగ్ కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగాయి. మానసిక ఆరోగ్య నిపుణులు విద్యార్థులకు కౌన్సెలింగ్ అవసరమని సూచిస్తున్నారు.





















