Chandrababu News: చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ: టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్
TDP Vs YSRCP: చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాయకులు యుద్దానికి దిగారు.
Chandra Babu Naidu Prasanth Kishore Meeting: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వణుకు పుట్టించే చలిలోనే సెగలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వ్యతిరేకత ఉన్న మంత్రులకు నియోజకవర్గాలను మార్చేశారు. టికెట్లు దక్కని నేతలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని జగన్ సూచించారు. ఇలాంటి సమయంలోనే రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోనూ చర్చలు జరిపారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాయకులు యుద్దానికి దిగారు. కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య ప్రశాంత్ కిశోర్ ప్లాన్ అని, ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకున్నారు’ అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోస్టు చేశారు.
కోడికత్తి, వివేకానందరెడ్డి గారి హత్య... PK ప్లాన్ అన్నారు…
— Gudivada Amarnath (@gudivadaamar) December 23, 2023
- ఇప్పుడు ఆ PKనే ఇంటికి తెచ్చుకున్నారు...!!
దీనికి మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ హత్య, కోడికత్తి వెనక వ్యూహం జగన్‌దేనని అంగీకరించినందుకు ధన్యవాదాలు కోడిగుడ్డు మంత్రి గారూ’ అంటూ సెటైర్లు వేశారు.
బాబాయ్ హత్య, కోడికత్తి వెనుక వ్యూహం మొత్తం జగన్ దే అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు కోడిగుడ్డు మంత్రి గారూ!.. @gudivadaamar https://t.co/NhIxOuCm6Z
— N Amarnath Reddy (@NAmaranathReddy) December 23, 2023
సాగునీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు సైతం ఎక్స్ లో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు అని రాంబాబు పోస్టు చేశారు.
మెటీరియలే మంచిది కాకపోతే
— Ambati Rambabu (@AmbatiRambabu) December 23, 2023
మేస్త్రి ఏమి చేయగలడు ?@naralokesh pic.twitter.com/1QC3r6mWwX
అంబటి రాంబాబు పోస్టుకు మాజీమంత్రి జవహర్ కౌంటర్ ఇచ్చారు. నిజమే మీ దగ్గర మెటీరియల్ లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నిజమే....మెటీరియల్ లేదనేగా. ..గంటకు కూడా ఎవరూ రానిది.... @AmbatiRambabu https://t.co/MyiAeDL3vi
— ksjawahar (@ksjawahar) December 23, 2023
వచ్చే ఏడాది ఫిబ్రవరి 20నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందుగానే ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే... 20 రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని అధికార, విపక్ష నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల సీఈవోలు, సీఎస్‌లకు ఈ ఆదేశాలు జారీ చేసింది.