Swiggy Boy: స్విగ్గీ డెలివరీ బాయ్ ఆ సర్వీస్ కూడా చేస్తానన్నడట - సోషల్ మీడియాలో కస్టమర్ పోస్ట్ - తర్వాత ఏం జరిగిందంటే ?
Delivery Boy: స్విగ్గి డెలివరీ బాయ్ ఘోరంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి రెడిట్ లో పోస్టు పెట్టాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. అదే మహిళ ఉంటే పరిస్థితి ఏమిటని ఆ యువకుడి వాదన.

Swiggy Delivery Boy Harasses Bengaluru Man: ఈ రోజుల్లో అన్నీ డోర్ డెలివరీ అయిపోతున్నాయి. వస్తువులే కాదు.. ఏదైనా చిన్న, పెద్ద ప్యాకేజీ ఎక్కడికైనా పంపాలన్న సరే సర్వీసులు ఉన్నాయి. అయితే అందరూ మంచి వాళ్లు అవ్వాలని లేదు. కొంత మంది ఘోరమైన ఆలోచనలు ఉన్న వాళ్లు కూడా ఉంటారు. అయితే కంపెనీలు అలాంటి వారిని గుర్తించడానికి చాలా ఏర్పాట్లు చేశాయి. వెంటనే కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు తాము నియమించుకునే ఏజెంట్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తారు. అయినా కొంత మంది తాము చేసిన పనుల్ని బయటకు చెప్పుకోలేరని రెచ్చిపోతూంటారు. అలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. 
బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న ఓ యువకుడు ఓ వస్తువును ప్యాకేజీగా చేసి వేరే చోట ఉంటున్న మిత్రుడికి పంపించాలనుకున్నారు. ప్యాక్ చేసి.. రాపిడోలో బుక్ చేశారు. అయితే స్విగ్గి టీ షర్ట్ వేసుకున్న డెలివరీ బాయ్ వచ్చారు. తాను ర్యాపిడో ఏజెంట్ ను కూడా అని చెప్పి.. ప్యాకేజీ తీసుకున్నాడు. ఓటీపీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత రూమ్ లో ఒక్కడే ఉన్నాడని అనుకున్నాడు. అందుకే అభ్యంతరకమైన .. వ్యక్తిగత పని చేస్తానని చెప్పాడు. దాంతో భయపడిపోయిన ఆ యువకుడు వెంటనే ప్యాకేజీ తీసుకుని .. ప్యాకేజీ డ్రాపింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆ యువకుడ్ని పంపేశాడు.
Also Read : సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నో - రేప్ కేసు పెట్టిన యువతి - ప్రేమ వైఫల్యం నేరం కాదన్న కోర్టు !
వెంటనే .. అతను ఇలా అన్నాడు.. నేను ఏంచేయాలి అంటూ రెడిట్ లో చాలా పెద్ద పోస్టు పెట్టాడు. వెంటనే ఆ పోస్టు వైరల్ అయింది. అదే మగవాడు కాబట్టి సరిపోయింది.. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు అతను అలాంటి ప్రపోజల్స్ పెట్టి.. బలవంతం చేస్తే ఎలా అన్న ప్రశ్న ఎక్కువ మంది వ్యక్తం చేశారు. అతనికి ప్యాకేజీ ఇవ్వకపోవడం కూడా మంచిదయిందని కొంత మంది చెప్పుకొచ్చారు.
ఈ యువకుడి పోస్టు వైరల్ కావడంతో స్విగ్గి కూడా వెంటనే స్పందించింది. ఆ డెలివరీ బాయ్ ఐడీని ఇమ్మీడియట్ గా బ్లాక్ చేసింది. విచారమ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ర్యాపిడో కూడా అతని ఐడీని బ్లాక్ చేసినట్లుగా ప్రకటించింది. అయితే కొంత మంది మాత్రం పూర్తిగా వన్ సైడ్ గా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలని.. అసలేం జరిగిందో ఆ డెలివరీ బాయ్ ను కూడా ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నారు. మొత్తంగా రెడిట్ పోస్టుతో ఆ యువకుడు మాత్రం.. స్విగ్గి , ర్యాపిడోకు టెన్షన్ రేపాడు.
Also Read: ప్రీతీ జింతాతోనూ తిట్టించుకున్న కాంగ్రెస్ - ఫేక్ న్యూస్‌తో పాలిటిక్స్ చేస్తే ఇంతే !





















