అన్వేషించండి

Swati Maliwal Case: అనుమతి లేకుండా లోపలికి వచ్చింది, జైలుకి పంపిస్తా అని బెదిరించింది - స్వాతి మలివాల్‌పై నిందితుడి ఫిర్యాదు

Swati Maliwal: స్వాతి మలివాల్‌ అనుమతి లేకుండా సీఎం ఇంట్లోకి వచ్చిందని లోపలికి అనుమతించకపోతే తనను జైలుకి పంపిస్తా అని బెదిరించిందని బిభవ్ కుమార్ ఫిర్యాదు చేశాడు.

Swati Maliwal Assault Case: ఇప్పటికే ఢిల్లీని లిక్కర్ స్కామ్ కేసు కుదిపేస్తుండగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు దాడి చేసిన ఘటన రాజకీయాల్ని వేడెక్కించింది. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది ఈ కేసు. తనపై విచక్షణారహితంగా బిభవ్ కుమార్ దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేశారు. అయితే...బిభవ్ కుమార్ కౌంటర్ కంప్లెయింట్ ఇచ్చాడు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించాడు. ఇదంతా కుట్ర అని కొట్టి పారేశాడు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా, బలవంతంగా సీఎం ఇంట్లోకి స్వాతి మలివాల్ దూసుకొచ్చారని ఆరోపించాడు. 

"ఇదంతా నాపై కుట్రపూరితంగా ఒత్తిడి పెంచేందుకు చేస్తున్నదే. మే 13వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా బలవంతంగా స్వాతి మలివాల్ సీఎం ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారు. నేను ఆమెను ఆపేందుకు ప్రయత్నించాను. కానీ నా మాట వినలేదు. పైగా నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టింది. ఓ ఎంపీని ఆపేందుకు నీకెంత ధైర్యం, నీ స్థాయి ఏంటో తెలుసా అంటూ నాపై మండి పడింది. ఏదో ఓ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తా అని బెదిరించింది"

- బిభవ్ కుమార్

ఈ కంప్లెయింట్‌ని నార్త్ ఢిల్లీ డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి పంపాడు బిభవ్ కుమార్. అంతకు ముందు బిభవ్ కుమార్‌పై ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్‌ ఆప్‌పై మండి పడ్డారు. దాడి చేసిన మాట నిజమే అని ఒప్పుకున్న పార్టీ ఆ తరవాత యూటర్న్ తీసుకుందంటూ ఫైర్ అయ్యారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనను బీజేపీ ఏజెంట్‌గా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఆప్ మాత్రం దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళా భద్రతా సిబ్బంది స్వాతి మలివాల్‌ని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు ఇందులో రికార్డ్ అయ్యాయి. ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా లోపలికి వచ్చి అందరినీ ఇబ్బందికి గురి చేశారని ఇప్పటికే ఆప్ నేత అతిషి తీవ్రంగా మండి పడ్డారు. ఈ వీడియో బయటకు వచ్చాక ఈ వివాదం మరింత రాజుకుంది. స్వాతి మలివాల్ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆప్ ఆరోపణల్ని జేపీ నడ్డా కొట్టి పారేశారు. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి అలవాటే అని మండి పడ్డారు. 

Also Read: Kyrgyzstan News: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు, అప్రమత్తమైన భారత్

టాప్ హెడ్ లైన్స్

Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Shubman Gill Ignores Kuldeep Yadav: కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget