అన్వేషించండి

Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!

Supreme Court Security : సుప్రీంకోర్టులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ పిటిషనర్ పై జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టాడు. అతనికి మతి స్థిమితం లేదని భావిస్తున్నారు.

Contempt Of Court :   దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని విధంగా తీవ్ర గందరగోళం, డ్రామా చోటుచేసుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా.. స్వయంగా వాదనలు వినిపించడానికి  లిటిగెంట్-ఇన్-పర్సన్ గావచ్చిన ఒక వ్యక్తి కోర్టు హాల్లో వీరంగం సృష్టించాడు. న్యాయమూర్తులపైకి కేసు ఫైళ్లను విసిరేయడమే కాకుండా, బహిరంగ కోర్టులోనే జడ్జీలను ఉద్దేశించి తీవ్రమైన బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు లాగేశారు.
 
 నేను సార్వభౌముడిని.. మిమ్మల్ని ఆదేశిస్తున్నా! : పిటిషనర్ వింత ప్రవర్తన 

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ వింత పరిణామం వెలుగుచూసింది. కోర్టు విచారణ ప్రారంభం కాగానే, ప్రబల్ ప్రతాప్ అనే సదరు పిటిషనర్ కనీస చట్టపరమైన వాదనలు వినిపించకుండా అత్యంత దూకుడుగా మాట్లాడటం ప్రారంభించాడు.  మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్  .. ఉత్తరప్రదేశ్ లక్నో ఏసీపీపై, డూప్లెక్స్ టెక్నాలజీస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. ఎందుకంటే నేను సార్వభౌముడిని  " అంటూ జడ్జీలకే హుకుం జారీ చేశాడు.
 
 షాకైన జడ్జీలు.. కోర్టు హాల్లో ఫైళ్ల వర్షం! 

పిటిషనర్ ప్రవర్తనకు ధర్మాసనం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నువ్వు మమ్మల్ని ఆదేశిస్తున్నావా?  అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. దానికి సదరు వ్యక్తి..  నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే, అంతా రికార్డుల్లో ఉంది  అంటూ తన చేతిలోని కేసు ఫైళ్ల కట్టను గాల్లోకి విసిరేశాడు. ఆ కాగితాలన్నీ కోర్టు హాల్లో జడ్జీల మీదుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతటితో ఆగకుండా, భారత ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి కూడా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించాడు.  

 
 బలవంతంగా ఈడ్చేసిన సెక్యూరిటీ.. 

కోర్టు హాల్లో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడ ఉన్న సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది వెనువెంటనే స్పందించారు. జడ్జీలపైకి దూసుకుపోకుండా అతడిని గట్టిగా పట్టుకుని, నియంత్రించి.. కోర్టు గది నుండి వెలుపలికి నెట్టేశారు. కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు, ఇతర లిటిగెంట్లు ఈ హఠాత్పరిణామాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.
 
 పెద్ద మనసు చాటుకున్న ధర్మాసనం 

సాధారణంగా కోర్టు ధిక్కరణ లేదా న్యాయమూర్తులపై దాడికి ప్రయత్నిస్తే కఠినమైన జైలు శిక్షలు విధిస్తారు. అయితే, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సదరు వ్యక్తిపై ఎలాంటి కఠిన చర్యలకు లేదా కోర్టు ధిక్కరణ  చర్యలకు నిరాకరించి పెద్ద మనసు చాటుకుంది.  అతడిపై మేం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆ పిటిషనర్ పట్ల మాకు కేవలం సానుభూతి మాత్రమే ఉంది అని జస్టిస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అనంతరం కేసు రికార్డులను పరిశీలించి, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు లేవంటూ సదరు స్పెషల్ లీవ్ పిటిషన్  ను కోర్టు కొట్టివేసింది.
 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget