అన్వేషించండి

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడంటే అంత ఈజీ కాదు-ఈ సవాళ్లు దాటితే కానీ గౌరవం దక్కదు

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రణిల్ విక్రమసింఘేకు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

రణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ అయ్యారు బానే ఉంది. కానీ..ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో అధ్యక్ష 
పదవి చేపట్టటం అంత సులువేమీ కాదు. ఒకటి కాదు. రెండు కాదు. ఎన్నో సవాళ్లు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను 
చక్కదిద్దటమే కాకుండా, ప్రజల జీవన స్థితిగతులనూ మార్చే బాధ్యత ఆయనపైనే ఉంది. ఇక రాజకీయ స్థిరత్వం తీసుకురావటం మరో అతి పెద్ద ఛాలెంజ్. అప్పులు తీర్చటమైతే కత్తిమీద సామే. మరి ఈ సవాళ్లన్నింటినీ రణిల్ విక్రమసింఘే ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఈ సవాళ్లలో మొట్టమొదట చెప్పుకోవాల్సింది ప్రభుత్వ వ్యతిరేకత గురించే. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వంపైన పీకల దాకా కోపం ఉంది. ఇప్పటి వరకూ ఉన్న పాలకులు తమ జీవితాల్ని అస్తవ్యస్తం చేశారన్న ఆగ్రహం, అసంతృప్తి వారిలో అగ్నిలా రగులుతోంది. అందుకే ఆ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఏకంగా ప్రధాని, అధ్యక్షుడి ఇళ్లనే ముట్టడించి ధ్వంసం చేశారు. 

ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటారా..? 

శ్రీలంక ప్రజలు చేస్తున్న డిమాండ్లలో "రణిల్ విక్రమసింఘే రాజీనామా" కూడా ఒకటి. ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిరసనలు చేపట్టారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా అధ్యక్ష పీఠాన్నే ఎక్కటం, వారిలో అసంతృప్తిని ఇంకా పెంచేదే. అసలు శ్రీలంక ప్రజలు రణిల్‌ విక్రమసింఘేను అధ్యక్షుడిగా అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. దేశానికి ఈ గతి పట్టటానికి కారణమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు అని బలంగా నమ్ముతున్నారు లంకేయులు. అలాంటప్పుడు ఆయన పరిపాలనను మాత్రం సమ్మతిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ సవాలు దాటటం రణిల్ విక్రమసింఘేకు కష్టతరమైన పనే. 

అన్ని అప్పులు ఎలా తీర్చుతారో..? 

శ్రీలంక పరిస్థితి ఇంతలా దిగజారటానికి ప్రధాన కారణం...విదేశాల నుంచి తీసుకున్న అప్పులు. ఈ మొత్తం 51 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రణిల్ విక్రమసింఘే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే చేయాల్సిన మొట్టమొదటి పనేదైనా ఉందంటే..అది IMFను అభ్యర్థించటమే. బెయిల్‌ అవుట్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటే తప్ప ఈ అప్పుల కుప్పల నుంచి శ్రీలంక బయటపడలేదు. అయితే ఈ ప్యాకేజ్‌ను IMFఅంత సులువుగా ఇచ్చే దాఖలాలైతే కనిపించటం లేదు. అవినీతిని అరికట్టటం సహా ఆర్థిక వ్యవస్థను కాస్త కుదురుకునేలా శ్రీలంక ఎన్నో చర్యలు చేపట్టాలని, అప్పుడు కానీ బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. 

ఇంధన కొరతనూ తీర్చుకోక తప్పదు...

చమురు కొరత శ్రీలంకను దారుణంగా వేధిస్తోంది. జూన్‌లో రెండు వారాల పాటు పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ఆపేయాల్సి వచ్చిందంటే ఆ దేశంలో కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షార్టేజ్ వల్ల ధరలు అమాంతం పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.450గా ఉంది. రణిల్ విక్రమసింఘే...వెంటనే ఈ ధరలు తగ్గించి ప్రజలందరికీ అందుబాటు ధరలకే పెట్రోల్, డీజిల్ విక్రయించేలా చర్యలు చేపట్టాలి. కానీ...చమురు దిగుమతులు సరిపడ డబ్బులు తమ వద్ద లేవని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

మారక ద్రవ్య నిల్వలు పెంచాలి..

ప్రస్తుతం శ్రీలంక వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలతో మరో మూడు నెలలు మాత్రమే దిగుమతులు చేసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం  ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేసింది. యూఎస్ డాలర్ లావాదేవీలను తగ్గించటం సహా కెమికల్స్, వెహికిల్స్‌ దిగుమతులను నియంత్రించింది. అయితే ఈ దేశం నుంచి అయ్యే ఎగుమతులతో పోల్చితే..దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. రణిల్ విక్రమసింఘే ఫారెక్స్ నిల్వలను పెంచుకోవటం, దిగుమతులు తగ్గించుకోవటాన్ని బ్యాలెన్స్ చేస్తే తప్ప అప్పులు తీర్చటం అసాధ్యం. వీటితో పాటు పర్యాటక రంగానికి మళ్లీ అప్పటి వైభవం తీసుకురావటమూ కీలకమే. ఈస్టర్ దాడులు, కరోనా వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం లాంటి కారణాలతో ఈ దేశానికి పర్యాటకులు రావటం బాగా తగ్గిపోయింది. ఆ మేరకు ఆదాయానికీ గండి పడింది. ఇప్పుడు దేశ పరిస్థితులు చక్కదిద్ది మళ్లీ పర్యాటక రంగంలో జోష్ తీసుకురావాల్సిన బాధ్యతను రణిల్ విక్రమసింఘే తీసుకోక తప్పదు. 


 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget