అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: విజయ్‌కు మద్దతివ్వకపోతే అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి గడ్డు కాలం!

tvk vijay: విజయ్‌కు మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగమైపోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. పళనిస్వామి అంగీకరించకపోతే చీలిపోయేందుకు రెడీ అవుతున్నారు.

AIADMK MLAs side with Vijay:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం  108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచింది.  ప్రధాన ప్రతిపక్షం  అన్నాడీఎంకే  లో చీలిక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు 

చెన్నైలోని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం కార్యాలయం ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు అడ్డాగా మారింది. పార్టీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది, అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరంతా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి ని ఈ ఎమ్మెల్యేలు కలిసి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని లేదా బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

చారిత్రక తీర్పు.. ద్రావిడ పక్షాల వెనకడుగు 

ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలకే పరిమితం కాగా, డీఎంకే కేవలం 59 స్థానాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించి ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టింది. ప్రస్తుతం టీవీకేకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా, మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తుండటం పళనిస్వామికి పెద్ద తలనెప్పిగా మారింది.

 పార్టీ చీలికను కొట్టిపారేస్తున్న హైకమాండ్ 

అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేరని ఆయన పేర్కొన్నారు. అయితే, టీవీకే మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ మద్దతు కోరలేదని, మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఎడప్పాడి పళనిస్వామి గనుక మద్దతుకు నిరాకరిస్తే, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి విజయ్ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.  

 విజయ్ పట్టాభిషేకానికి ముహూర్తం? 

మరోవైపు, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్ష పార్టీలు , విసికె  నేతలతో టీవీకే ఇప్పటికే చర్చలు జరుపుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు గనుక లభిస్తే, ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయ్ ప్రభుత్వం కొలువుదీరుతుంది.   

టాప్ హెడ్ లైన్స్

ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Rahul Gandhi Phone Tapping Allegation: నా ఫోన్ ట్యాప్ అవుతోంది, అందులోనే సాక్ష్యాలు.. సీక్రెట్స్ బయటపెడతా: రాహుల్ గాంధీ ఆరోపణలు
నా ఫోన్ ట్యాప్ అవుతోంది, అందులోనే సాక్ష్యాలు.. సీక్రెట్స్ బయటపెడతా: రాహుల్ గాంధీ ఆరోపణలు
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Embed widget