By: Ram Manohar | Updated at : 20 May 2023 04:35 PM (IST)
అమెరికాలోని ఓ సిటీలో సబ్‌స్టేషన్‌లోకి పాము వెళ్లడం వల్ల పవర్ కట్ అయ్యి 16 వేల మంది చీకట్లోనే మగ్గిపోతున్నారు.
Snake in Electric Equipment:
సబ్‌స్టేషన్‌లో పాము
అమెరికాలోని ఆస్టిన్‌లో పవర్ కట్..దాదాపు 16 వేల మందిని చీకట్లోకి నెట్టేసింది. ఎంతకీ కరెంట్ రాకపోవడం వల్ల అసలేమైందని ఆరా తీశారు స్థానికులు. అప్పుడే అసలు విషయం తెలిసింది. దగ్గర్లోని ఓ సబ్‌స్టేషన్‌లో పాము దూరింది. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లో పాము వెళ్లడం వల్ల ఆ పరికరం పాడైంది. సడెన్‌గా పవర్ కట్ అయింది. మే 16వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు కరెంట్ పోగా...రెండ్రోజుల తరవాత ఇందుకు కారణమేంటో తెలిసింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌పై నుంచి పాము వెళ్లడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. ఫలితంగా పవర్ పోయింది. పవర్ గ్రిడ్‌లో టెక్నికల్‌గా ఎలాంటి సమస్య తలెత్తలేదని అధికారులు వెల్లడించారు. పాము కారణంగానే పవర్ కట్ అయిందని స్పష్టం చేశారు.
"గ్రిడ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓ పాము కారణంగా పవర్ కట్ అయింది. సబ్‌స్టేషన్‌లోని ఎలక్ట్రిఫైడ్ సర్క్యూట్‌లోకి దూరడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇక్కడ పవర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే...వీలైనంత వరకూ సమస్య రాకుండానే చూసుకుంటాం. కానీ...ఇలా అప్పుడప్పుడు పాములు వచ్చి దూరడం వల్ల మాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వీలైనంత త్వరగా రీస్టోర్ చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయాల్లో ఎలా రిపేర్ చేయాలో కూడా అర్థం కాదు. అందుకే సమయం పడుతుంది"
- అధికారులు
Update: Wildlife interference can result in power outages. Today a snake crawled into one of our substations and made contact with an electrified circuit. All customers from this outage have been restored as of 2 p.m. today. Thank you for your patience.
— Austin Energy (@austinenergy) May 16, 2023
We're aware of an outage affecting several circuits in the East Austin area and have crews onsite assessing the situation. Thank you for your patience as we work to restore power as safely and quickly as possible. https://t.co/CUzgszlgRZ
— Austin Energy (@austinenergy) May 16, 2023
గతేడాది జపాన్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు 10 వేల కుటుంబాలకు పవర్ కట్ అయింది. సబ్‌స్టేషన్‌లోని ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్‌లోకి పాము దూరి షాక్ కొట్టి చనిపోయింది. ఈ కారణంగా పవర్ సప్ల్లైకి అంతరాయం కలిగింది. కప్పలు, పాములు గ్లోబల్ ఎకానమీని దెబ్బ తీస్తున్నాయి. వాటి వల్లే వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఓ అధ్యయనం చెప్పిన సంగతి ఇది. కేవలం కప్పలు, పాముల వల్ల దాదాపు 16 బిలియన్ డాలర్ల మేర ప్రపంచ ఎకానమీ నష్టపోవాల్సి వస్తోందని తేల్చి చెప్పింది ఆ స్టడీ. అమెరికన్ బుల్‌ఫ్రాగ్, బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా...1986 నుంచి 2020 వరకూ జరిగిన నష్టమిదని వెల్లడించింది. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌లు పంట పొలాల్ని నాశనం చేస్తుండగా, బ్రౌన్ ట్రీ స్నేక్‌లు ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లపైకి ఎక్కి విలువైన వాటిని డ్యామేజ్ చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాగ్‌లను లితోబేట్స్ కాటెస్‌బియానస్ గా పిలుస్తారు. వీటి బరువు 2 పౌండ్లు. అంటే 0.9 కిలోలు. ఐరోపాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఈ రీసెర్చ్ నిర్ధరించింది. ఇక బ్రౌన్ ట్రీ స్నేక్‌లను బొయిగా ఇర్రెగ్యులారిస్‌గా పిలుస్తారు. పసిఫిక్ ఐల్యాండ్స్‌లో వీటి సంతతి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ, అవి పని చేయకుండా చేస్తున్నాయి ఈ పాములు.
Also Read: Modi Hugs Biden: జో బైడెన్‌ని కౌగిలించుకున్న ప్రధాని మోదీ, ఆత్మీయంగా పలకరింపు
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?