అన్వేషించండి

Shraddha Murder Case: అవి శ్రద్ధా ఎముకలే- దిల్లీ హత్య కేసులో కీలక అప్‌డేట్

Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరో కీలక అప్‌డేట్‌ను పోలీసులు తెలిపారు.

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రద్ధాను అత్యంత దారుణంగా చంపి ఆమె శ‌రీరాన్ని 35 ముక్క‌లుగా చేసి .. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ప‌డేశాడు. ఈ కేసులో తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.

ఆమెవే

స‌మీప అడ‌వుల్లో శ్ర‌ద్ధా శ‌రీర భాగాల‌ను సేక‌రించిన పోలీసులు వాటిని డీఎన్ఏ ప‌రీక్షకు పంపారు. అయితే దిల్లీ అడ‌వుల్లో దొరికిన ఎముక‌లు శ్ర‌ద్ధావేనని డాక్ట‌ర్లు తేల్చారు. ఈ మేరకు డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా నిర్ధర‌ణయిన‌ట్లు తెలుస్తోంది. మెహ‌రౌలీ, గురుగ్రామ్ అడ‌వుల నుంచి దిల్లీ పోలీసులు శ్ర‌ద్ధా ఎముక‌ల్ని సేక‌రించారు. ఆ ఎముక‌ల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌లో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయిన‌ట్లు గుర్తించారు.

దారుణంగా

శ్రద్ధా వాకర్‌ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అఫ్తాబ్ ఇటీవలే పోలీసులకు వెల్లడించాడు. బంబుల్‌ డేట్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా కలిసిందని దీనిపైనే తమ మధ్య గొడవ జరిగినట్లు పోలీసులకు అఫ్తాబ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ గొడవ వల్లనే ఆమెను హత్యను చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా ఒప్పుకున్నాడు.

బంబుల్‌ డేట్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్‌ మే 17న గురుగ్రామ్‌లో కలిసిందని నిందితుడు అఫ్తాబ్‌ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మరునాడు మధ్యాహ్నం ఆమె తమ ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని చెప్పాడు. ఈ అంశంపై తమ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమె గొంతునొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో అఫ్తాబ్ పేర్కొన్నాడు. కొంత కాలంగా తాము సన్నిహితంగా కాకుండా కేవలం రూమ్‌మేట్స్‌గా నివసిస్తున్నట్లు అఫ్తాబ్ వెల్లడించాడు.

మరోవైపు శ్రద్ధా వాకర్‌ ఫోన్‌ కాల్స్‌, లొకేషన్ టవర్‌ డేటా ఆధారంగా దిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధరించారు. అలాగే బంబుల్‌ డేట్‌ యాప్‌కు లేఖ రాసి ఆమె కలిసిన వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే గురుగ్రామ్‌లో శ్రద్ధా కలిసిన వ్యక్తి వివరాలు పోలీసులు బయటపెట్టలేదు.

కత్తి రికవరీ

శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు అఫ్తాబ్.. చైనీస్ కత్తిని ఉపయోగించినట్లు సీనియర్ దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్‌లోని తన కార్యాలయం సమీపంలోని పొదల్లో ఆ కత్తిని అఫ్తాబ్ విసిరేసినట్లు తెలిసింది. ఈ విషయాన్న అఫ్తాబ్.. నార్కో పరీక్షలో అంగీకరించాడు. శ్రద్ధా తలను మెహ్రౌలీ అడవుల్లో పడేసినట్లు దిల్లీ పోలీసులకు అఫ్తాబ్ వెల్లడించాడు.

నార్కో పరీక్షలు

నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. దిల్లీ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు రెండు గంటల పాటు నార్కో పరీక్ష కొనసాగింది. పరీక్ష  ముగిసిందని ఆ సమయంలో అఫ్తాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

నార్కో పరీక్ష చేసే ముందు టెస్ట్‌ గురించి అఫ్తాబ్‌కు నిపుణుల బృందం వివరించింది. అతడి అంగీకారం తీసుకుంది. అనంతరం 10 గంటలకు నార్కోటెస్ట్‌ మొదలుపెట్టిన అధికారులు.. సుమారు రెండు గంటలపాటు నిందితుడిని ప్రశ్నించినట్లు సమాచారం. 

శ్రద్ధాను అత్యంత దారుణంగా హతమార్చినట్లు నిందుతుడు విచారణలో అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన పాలిగ్రాఫ్‌ టెస్టులోనూ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం, బాధ లేదని చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హత్యానంతరం ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడని సమాచారం.

ఆమెను హత్య చేయాలని చాలా కాలం క్రితమే అఫ్తాబ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నాడు.

Also Read: Kharge on Modi Govt: 'పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా?'- మోదీకి ఖర్గే ప్రశ్న

టాప్ హెడ్ లైన్స్

Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
ABP Desam Top 10, 17 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 17 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget