అన్వేషించండి

వైరల్ వీడియో: మంత్రి సంజయ్ షిర్సాట్ ఇంట్లో నగదు కట్టలు.. హోటల్ కొనుగోలుపై విచారణ!

Maharastra: మహారాష్ట్ర మంత్రివర్గంలో శివసేన తరపున మంత్రిగా ఉన్న సంజయ్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు కట్టలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Sanjay Shirsat video :మహారాష్ట్రలోని శివసేన (షిండే వర్గం) నాయకుడు, సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్‌కు సంబంధించిన ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో షిర్సాట్ తన గదిలో ఒక బ్యాగ్ పక్కన కూర్చుని ఉండగా, ఆ బ్యాగ్‌లో నగదు కట్టలు కనిపిస్తున్నాయి.  షిర్సాట్ ,  అతని కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్‌లు చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది. హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల ఉంటే  రూ. 65 కోట్లకు కొనుగోలు చేశారు.  ఈ ఘటనలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి.  
 
సంజయ్ షిర్సాట్ వీడియో  నిజమేనని అంగీకరించారు.  కానీ ఇది ఒక "కుట్ర" అని పేర్కొన్నారు. పర్యటన నుంచి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరో ఈ వీడియో తీశారు. బ్యాగ్‌లో ఏముందో తనకు తెలియదని మంత్రి చెబుతున్నారు.  ఈ వీడియోను రాజకీయంగా ప్రేరేపితమైనదని ఆరోపిస్తున్నారు.  శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ఈ వీడియోను షేర్ చేశారు.  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలు చేశారు. 

చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను సంజయ్ షిర్సాట్ కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్ యాజమాన్యంలోని "ఎం/ఎస్ సిద్ధాంత్ మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ సప్లై" కంపెనీ రూ. 65 కోట్లకు టెండర్ ద్వారా గెలుచుకుంది. అయితే, ఈ హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని విపక్ష నాయకుడు అంబదాస్ దాన్వే ఆరోపించారు.  ఈ టెండర్ ప్రక్రియలో అవినీతి మరియు కార్టెలైజేషన్ జరిగిందని ఆరోపించారు. సిద్ధాంత్ కంపెనీ 2024లో ఏర్పాటైంది.  టెండర్‌కు అర్హత కోసం అవసరమైన మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లు లేవని ఆయన పేర్కొన్నారు .

 హోటల్ విలువ 2018లో రూ. 75.92 కోట్లుగా నిర్ణయించారు.  2025లో దాని విలువ రూ. 150 కోట్లుగా ఉందని, అయినప్పటికీ 2018 రేట్ల ఆధారంగా టెండర్ జరిగిందని దాన్వే విమర్శించారు   సిద్ధాంత్ షిర్సాట్ కు ఆర్థిక సామర్థ్యం లేదని అంటున్నారు.  షిర్సాట్ 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారుడు ఎలాంటి ఆస్తులు కలిగి లేడని పేర్కొన్నారు.  సంజయ్ షిర్సాట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు, టెండర్ ప్రక్రియ కోర్టు ఆదేశాల మేరకు జరిగిందని, ఆరు సార్లు టెండర్ విఫలమైన తర్వాత సిద్ధాంత్ కంపెనీ పాల్గొందని చెప్పారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 7, 2025న ఈ టెండర్ ప్రక్రియలో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. టెండర్ రద్దు చేశారు. 

సంజయ్ షిర్సాట్ 2019 ఎన్నికలలో రూ. 3.3 కోట్ల ఆస్తులను ప్రకటించగా, 2024 ఎన్నికలలో ఇది రూ. 35 కోట్లకు పెరిగింది, దీనిలో రూ. 44.8 లక్షల నగదు, రూ. 26.5 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ఈ ఆస్తులలో రూ. 4.4 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ముంబై,  సంభాజీనగర్‌లో రూ. 4.7 కోట్ల విలువైన ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ ఆస్తుల పెరుగుదలపై వివరణ కోసం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జూలై 2025లో నోటీసు జారీ చేసింది.  సంజయ్ "డబ్బు సంపాదించడం సులభం, కానీ ఖర్చు చేయడం కష్టం" అని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు, ఇది వైరల్ అయింది.  షిర్సాట్ మొదట డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు ష్రీకాంత్ షిండేకు కూడా ఇన్‌కమ్ టాక్స్ నోటీసు వచ్చినట్లు చెప్పారు, కానీ తర్వాత ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget