Russia-Ukraine War: 'పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావు- అణు యుద్ధం నిజమే కావొచ్చు'
Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు హెచ్చరికలు ఉత్తి మాటలు కావని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన అణు హెచ్చరికలపై ఉక్రెయిన్ స్పందించింది. పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
గతంలో
పుతిన్ గతంలో కూడా అణు హెచ్చరికలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను 'న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్'గా జెలెన్‌స్కీ కొట్టి పారేశారు. కానీ ప్రస్తుతం పుతిన్ ఉత్తి మాటలు చెబుతున్నట్లు అనుకోవడం లేదన్నారు.
రష్యా వార్నింగ్
ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది 'రిజర్వ్స్' తిరిగి పిలుస్తున్నామన్నారు. గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని 'రిజర్వ్స్' అంటారు. వీరి సేవలను ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఉపయోగించుకోనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ అన్నారు.
" ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో 'రిజర్వ్స్' సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఉక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌లో ఉన్న మా వారిని రక్షించుకోవడం రష్యా బాధ్యత. అలాగే దేశంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు నిధుల కేటాయింపును పెంచాం. ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "
అమెరికా రియాక్షన్
రష్యా చేసిన అణు హెచ్చరికలపై అమెరికా స్పందించింది. రష్యా అణు యుద్ధం మొదలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది.
Also Read: Rajasthan Congress Crisis: 'గహ్లోత్ ఇలా చేశారా? అసలు నమ్మలేకపోతున్నాను'- సోనియా గాంధీ అసంతృప్తి!
Also Read: Ratan Tata: రతన్ టాటా 'సక్సెస్' మంత్రం ఇదే! ఆ మాటలు వినడంలో ఉన్న కిక్కే వేరప్పా!