Russia Ukraine Crisis: పుతిన్ హత్యకు కుట్ర, రెండు డ్రోన్లు కూల్చేవేత - ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపణలు
Russia Ukraine Crisis: పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని రష్యా ఆరోపించింది.
Russia Ukraine Crisis:
డ్రోన్లు కూల్చివేత
ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని ఆరోపించింది. రెండు డ్రోన్లను పుతిన్ ఆఫీస్‌పైకి పంపిందని, వాటిని తమ సైనికులు పేల్చి వేశారని వెల్లడించింది. దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది. దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కోలో డ్రోన్లపై నిషేధం విధించింది.
"ఉక్రెయిన్ పుతిన్ హత్యకు కుట్ర పన్నింది. రెండు డ్రోన్లు పుతిన్ ఆఫీస్‌పైకి వచ్చాయి. వాటిని గుర్తించి వెంటనే పేల్చి వేశాం. దీన్ని ఉగ్రదాడిగానే భావిస్తున్నాం. సరైన బదులు కచ్చితంగా ఇచ్చి తీరతాం. క్రెమ్లిన్‌ను టార్గెట్ చేస్తూ రెండు డ్రోన్లు దూసుకొచ్చాయి. వెంటనే పేల్చేశాం. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్రెమ్లిన్ బిల్డింగ్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవలేదు"
- రష్యా
KREMLIN DRONE ATTACK
— The Spectator Index (@spectatorindex) May 3, 2023
- Russia says two Ukrainian drones attacked Kremlin overnight
- Drones downed with no victims or material damage to the Kremlin
- Moscow says it was a terrorist attack and attempt on Putin's life
- Russia says it reserves right to respond when and how it… pic.twitter.com/loZA6c3Fvd
ఇప్పుడే కాదు. రష్యాలో పలు సార్లు ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయి. ప్రతిసారీ ఉక్రెయిన్‌పై వేలెత్తి చూపుతోంది రష్యా. అయితే..ఇప్పటి వరకూ ఉక్రెయిన్ మాత్రం ఆ దాడులు తామే చేసినట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సారి మాత్రం వెంటనే స్పందించింది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
Kremlin (Russia) says Kyiv (Ukraine) attempted an assassination of Russian President Putin, reports AFP
— ANI (@ANI) May 3, 2023
#UPDATE The Kremlin said on Wednesday it shot down two drones launched by Ukraine and accused Kyiv of attempting to kill Russian President Vladimir Putin. pic.twitter.com/hzzJTy9Pxu
— AFP News Agency (@AFP) May 3, 2023
ఇటీవల రష్యాకు చెందిన పది ఎయిర్‌క్రాఫ్ట్‌లు బెలారస్‌కు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇవన్నీ అణ్వాయుధాలును మోయగలిగే సామర్థ్యం ఉన్నవే. బెలారస్లో అణ్వాయుధాలను మొహరించడం...చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. చట్టానికి లోబడి మాత్రమే ఈ పని చేశామని వెల్లడించారు. అంతే కాదు. అమెరికా కూడా ఇదే పని చేస్తోందంటూ ఎదురు దాడికి దిగారు. ఐరోపా మిత్ర దేశాల్లో తమ అణ్వాయుధాలను దాచి ఉంచారని ఆరోపించారు. పోలాండ్‌తో సరిహద్దు పంచుకుంటున్న బెలారస్లో రష్యా అణ్వాయుధాలు ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. జులై 1వ తేదీ నాటికి బెలారస్లో న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రష్యా తేల్చి చెబుతోంది.
రష్యాకు మద్దతుగా నిలుస్తున్న బెలారస్‌పై అమెరికా ఆంక్షలు విధించిన వెంటనే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు అక్కడికి వెళ్లాయి. ఫలితంగా..రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్థాయికి వెళ్తుందా..? అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది దాటింది. ఇంకా పరిస్థితులు ఓ కొలిక్కి రాలేదు. రెండు దేశాలూ ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. రెండువైపులా నష్టం వాటిల్లుతున్నా వెనక్కి తగ్గడం లేదు. పైగా రానురాను మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇరు దేశాల అధ్యక్షులూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పుతిన్ అయితే పదేపదే..అణుదాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read: Serbia Shooting: స్కూల్లో విద్యార్థి కాల్పులు, 9 మంది మృతి - పలువురి పరిస్థితి విషమం