ఇండియాలో పరిస్థితులు బాలేవు, మా పిల్లల్ని ఫారిన్‌లోనే ఉండమన్నాను - ఆర్‌జేడీ నేత
Abdul Bari Siddiqui: భారత్‌లో ముస్లింల పరిస్థితులు బాలేవని, అందుకే తమ పిల్లల్ని విదేశాల్లో ఉండిపోమని చెప్పానని ఆర్‌జేడీ నేత పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
Abdul Bari Siddiqui on Muslims:
ముస్లింలను ఉద్దేశించి..?
బిహార్‌లోని ఆర్‌జేడీ నేత భారత్‌లోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇండియాలో పరిస్థితులేమీ బాలేవని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని తమ పిల్లలకు చెప్పానని అన్నారు...అబ్దుల్ బరి సిద్దిఖీ. ఆర్‌జేడీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. భారత్‌లో ముస్లింల స్థితిగతులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ దేశంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో ఓ ఉదాహరణ చెబుతాను. ఇది నా సొంత అనుభవం కూడా. నాకో కొడుకు ఉన్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వాళ్లను అక్కడే ఉద్యోగాలు చూసుకోమని చెప్పాను. వీలైతే అక్కడి పౌరసత్వం కూడా తీసుకోవాలని సూచించాను" అని అన్నారు అబ్దుల్ బరి. గత వారం ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇలా తన
అసహనాన్ని వ్యక్తం చేశారు. "నేను ఈ విషయం చెప్పగానే వాళ్లకు భయం మొదలైంది. మీరెందుకు ఇండియాలోనే ఉంటున్నారని నన్ను ప్రశ్నించారు. నేను ఏదో విధంగా నెగ్గుకు రాగలను...కానీ మీ వల్ల కాదు అని చెప్పాను" అని అన్నారు. అయితే...ఎక్కడా ఆయన ముస్లింలు అని కానీ...బీజేపీ పేరుని కానీ ప్రస్తావించలేదు. కానీ...బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "పాకిస్థాన్‌కు వెళ్లిపోతే మంచిది" అని సలహా కూడా ఇచ్చింది. "సిద్దిఖీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అంత ఇబ్బందిగా ఉంటే..రాజకీయ పరంగా లభిస్తున్న అన్ని సౌకర్యాలను వదులుకుని పాకిస్థాన్‌కు వెళ్లిపోతే మంచిది. ఆయనను ఎవరూ ఆపరు" అని మండి పడింది. సిద్దిఖీ...లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉండే వారని...ముస్లింలను తక్కువ చేసి చూసే అలాంటి పార్టీలో ఉండి ఆయన అలా అసహనానికి గురయ్యారని విమర్శిస్తోంది బీజేపీ.
గతంలో ఒవైసీ..
AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా గతంలో ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దేశంలోని బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా, ముస్లింలు ఓపెన్ జైలు జీవితం లాంటిది గడుపుతున్నారని అన్నారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోడ్డుపై తిరిగే కుక్కలను కూడా గౌరవిస్తున్నారు, ముస్లింలను మాత్రం గౌరవించరు’’ అంటూ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గుజరాత్‌లో పోలీసులు ముస్లిం యువకులను కూడలి మధ్యలో స్తంభానికి కట్టేసి, జనం ముందు కర్రలతో కొడుతుండగా, గుంపులు గుంపులుగా నినాదాలు చేస్తున్నారు. ముస్లిం యువతకు గౌరవం లేదా? దేశంలో
ఏం జరుగుతోంది? రోడ్డుపై తిరిగే కుక్కను గౌరవిస్తారు, కానీ ముస్లింను గౌరవించరు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు ఏం జరుగుతోంది? బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా ముస్లింలపై చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మదర్సాలు నేలమట్టం అవుతున్నాయి. వాటికి విలువ లేదా? దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిసారీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మోదీ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ స్థలంలో పోలీసులు ముస్లింలను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు. ప్రజలు అక్కడ నిలబడి చూస్తున్నారు. కానీ ఏమీ చేయడం లేదు. ఇంకా ముస్లింలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
Also Read: ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా- దేశంలో తొలి ముస్లిం మహిళ!