Republic Day 2024: రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి, ప్రత్యేక ఆకర్షణగా మహిళల బ్యాండ్
Republic Day 2024: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![Republic Day 2024: రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి, ప్రత్యేక ఆకర్షణగా మహిళల బ్యాండ్ Republic Day 2024 Nari Shakti takes centre stage in Republic Day Parade Republic Day 2024: రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి, ప్రత్యేక ఆకర్షణగా మహిళల బ్యాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/26/eeb57c12fcf5a63016986830b2d2dc021706248069777517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Republic Day Parade 2024: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో పరేడ్ నిర్వహించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించారు. ఆ తరవాత ముఖ్యఅతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి పరేడ్‌కి హాజరయ్యారు. ఈ సారి పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. తొలిసారి ఈ పరేడ్‌లో నారీశక్తి కనిపించింది. త్రివిధ దళాలకు చెందిన మహిళలు పరేడ్‌లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన 15 మంది మహిళా పైలట్‌లతో పాటు Central Armed Police Forces (CAPF)కి చెందిన మహిళలూ పరేడ్ నిర్వహించారు. మొత్తం పరేడ్‌లో ఇదే హైలైట్‌గా నిలిచింది.
#WATCH | Lt Col Ankita Chauhan of 11 Electronic Warfare Battalion of the Army leads the detachment of Mobile Drone Jammer System at #RepublicDay2024 parade. pic.twitter.com/2z8DFTOEvX
— ANI (@ANI) January 26, 2024
వీళ్లతో పాటు 100 మంది మహిళా కళాకారులు వాద్యాలు వాయించారు. శంఖం, నాదస్వరం లాంటి వాద్యాలు వాయిస్తూ పరేడ్ నిర్వహించారు. మిలిటరీ బ్యాండ్స్‌తో కాకుండా ఇలా పరేడ్ చేయడం ఇదే తొలిసారి.
#WATCH | Delhi | #RepublicDay2024 parade at Kartavya Path begins with 'Aavahan'.
— ANI (@ANI) January 26, 2024
For the first time ever, the parade is being heralded by over 100 women artists playing Indian musical instruments. The parade is commencing with the music of Sankh, Naadswaram, Nagada, etc. being… pic.twitter.com/ypM5ixl2Cd
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)