Reliance Foundation : బాలాసోర్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా రిలయన్స్ - ఉద్యోగాలు సహా అనేక రకాల సాయాలు ప్రకటించిన నీతూ అంబానీ!
బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ సాయం ప్రకటించింది. ఉద్యోగాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందించాలని నిర్ణయించారు.
Reliance Foundation : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదానీ గ్రూప్ ఇప్పటికే బాధిత పిల్లల విద్య బాధ్యతలు తీసుకుంటామని ప్రకటించింది. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ భారీ ప్యాకేజ్ ప్రకటించింది.. ఉద్యోగ కల్పన, నిత్యావసర వస్తువులు సరఫరా, మెడికల్ ఎయిడ్, వంటి వాటిని ఉచితంగా అందజేసేందుకు 10 అంశాల కార్యక్రమాన్ని అమలుచేయనుంది. . ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రిలయన్స్ ఫౌండేషన్ స్పెషలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్‌లో తన సహాయ, సహకారాలు అందించిందని రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతూ అంబానీ ప్రకటించారు.
తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తమ స్పెషలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఇప్పటికీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి. ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారి జీవితాలను తిరిగి యథాస్థితికి తీసుకురాలేమని, కానీ వారు తమ జీవితాలను పునర్నిర్మించుకునే వరకు రిలయన్స్ ఫౌండేషన్ బాధితులకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంది. అందుకోసం రిలయన్స్ ఫౌండేషన్ 10 రకాల సాయాలనుప్రకటించింది.
1. ప్రమాదంతో ప్రభావితమైన కుటుంబాలకు ఆరు నెలలపాటు రిలయన్స్ స్టోర్‌ల నుంచి ఉచితంగా బియ్యం, పప్పులు, చక్కెర, పిండి, ఉప్పు, వంటనూనె ఇస్తారు.
2. ప్రమాదంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేయించడం, అవసరమైన మందులు ఇస్తారు.
3. ప్రమాదంవల్ల కలిగిన భావోద్వేగపరమైన, మానసికపరమైన సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ చేయించడం.
4. అవసరమైతే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి జియో ద్వారా, రిలయన్స్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
5. ప్రమాదంలో అంగవైకల్యం చెందిన వారికి వీల్‌చైర్‌లు, ఆర్టిఫిషియల్ లింబ్స్ లాంటి అవసరమైన పనిముట్లు అందించాలని నిర్ణయించారు.
6. ప్రమాదంలో ప్రభావితమైన వారికి నూతన ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందచేస్తారు.
7. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
8. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు బతుకుదెరువు కోసం పాడి, పౌల్ట్రీ లాంటి ప్రత్యమ్నాయాలను సమకూర్చనున్నారు.
౯. బాధిత కుటుంబసభ్యుల్లో ఒకరికి తమ జీవితాలను మెరుగుపర్చుకోవడం కోసం ఏడాదిపాటు ఉచితంగా మొబైల్ కనెక్టివిటీ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.
10. ప్రమాద బాధితుల సహాయార్థం వినియోగిస్తున్న అంబులెన్స్‌లకు Jio-BP నెట్‌వర్క్ ద్వారా ఉచితంగా ఇంధనం అందచేస్తున్నారు.
Reliance Foundation Chairperson Mrs Nita Ambani announces a 10-point programme to support those affected by the unfortunate #OdishaTrainAccident.
— Reliance Foundation (@ril_foundation) June 5, 2023
Read the media release here: https://t.co/DSyrvVch2F pic.twitter.com/iVeKG3sAKr