Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'
Rajasthan Congress Crisis: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదని రాహుల్ గాంధీ అన్నారు.
Rajasthan Congress Crisis: రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంలో సాగుతోన్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందే అనుకున్నాం
యాత్ర ఇంతక ముందే చేసి ఉండాల్సింది అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు.
అదే లక్ష్యం
తనపై భాజపా నేతలు చేస్తోన్న వ్యక్తిగత విమర్శల గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయంటే మనం లక్ష్యం చేరుకుంటున్నామని అర్థమని రాహుల్ అన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో అమేఠీ నుంచే పోటీ చేస్తారా అని అడగగా ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి, ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తెలుస్తుందని రాహుల్ అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా భారత్ జోడో యాత్రపై మాత్రమే ఉందని సమాధానమిచ్చారు.
Also Read: Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!