PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నేత నరేంద్ర మోదీ, సర్వేలో వెల్లడి
PM Modi: అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని వెల్లడించింది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతోంది. విదేశాల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే కొన్ని సర్వేలు మోదీకి ది బెస్ట్ పీఎం అంటూ కితాబిచ్చాయి. ఇప్పుడు మరో రిపోర్ట్ కూడా ఇదే విషయం వెల్లడించింది. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని వెల్లడించింది. అత్యధికంగా 76 శాతం రేటింగ్‌తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
మార్నింగ్ కన్సల్ట్ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహా ఏ ఇతర దేశాధినేతలు ఎవరూ మోదీకి దరిదాపుల్లో లేరు. వరుసగా రెండుసార్లు అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోదీ రికార్డ్ సృష్టించారు. ‘మార్నింగ్ కన్సల్ట్’ మొత్తం 22 మంది ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వేలో ఈ ఏడాది జనవరి 26 నుంచి 31వ తేదీ మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ప్రతీ దేశంలో వయోజన ప్రజల ఏడు రోజుల సగటును తీసుకుని దీన్ని రూపొందించారు.
76 శాతం అమోదంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రేడర్ 61 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (55 శాతం), స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ (53 శాతం), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (49 శాతం) సాధించి తొలి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా సైతం 49 శాతం రేటింగ్ సాధించినా కూడా ఆయన ఆరవ స్థానానికి పరిమితమయ్యారు.
ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతంతో 7వ స్థానానికి పరిమితమయ్యారు. కెనడాప్రధాని జస్టిన్ ట్రూడో 39 శాతం ఆమోదంతో 9వ స్థానంలో నిలిచారు. యూకే ప్రధాని రిషి సునాక్ 34 శాతంతో 13వ స్థానం దక్కించుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 17వ స్థానంలో నిలిచారు.
Global Leader Approval: *Among all adults
— Morning Consult (@MorningConsult) April 3, 2023
Modi: 76%
López Obrador: 61%
Albanese: 55%
Meloni: 49%
Lula da Silva: 49%
Biden: 41%
Trudeau: 39%
Sánchez: 38%
Scholz: 35%
Sunak: 34%
Macron: 22%
*Updated 03/30/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/YdbVxp5TtX
ప్రపంచవ్యాప్తంగా రోజుకు 20 వేల మందిని ఇంటర్వ్యూ చేసిన Morning Consult ఈ ర్యాంకులు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలు చేసిన సమయంలో వాళ్లు ఇచ్చిన సమాధానాల ఆధారంగా లిస్ట్ తయారు చేశారు. అమెరికాలో 45 వేల మందిని ఇంటర్వ్యూ చేశారు. మిగతా దేశాల్లో ఈ సంఖ్య 500-5000 మందిని ఇంటర్వ్యూ చేశారు.