By: Ram Manohar | Updated at : 12 May 2023 01:01 PM (IST)
గుడ్‌గావ్‌లో పోర్ష్ కార్ డివైడర్‌ని ఢీకొట్టి మంటల్లో కాలి బూడిదైపోయింది. (Image Credits: ANI)
Porsche Car Accident:
గుడ్‌గావ్‌లో బీభత్సం..
గుడ్‌గావ్‌లో స్పోర్ట్స్ కార్ పార్ష్ (Porsche Car Fire)కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరి వేగంతో వచ్చి డివైడర్‌ని ఢీకొట్టింది. ఆ తరవాత అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. వెంటనే కార్‌లో నుంచి మంటలు చెలరేగాయి. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్ అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. గుడ్‌గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కార్‌లో ఇద్దరున్నారు. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...కార్‌లో మంటలు రాకముందే ఎలాగోలా అందులో నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. కాస్త ఆలస్యమైనా కార్‌తో పాటు సజీవదహనం అయ్యే వారు. చండీగఢ్‌లో రిజిస్టర్ అయిన ఈ కార్ డ్రైవర్ మితిమీరిన వేగంతో కార్‌ని నడిపినట్టు పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ తప్పి డివైడర్‌ని ఢీకొట్టిందని చెప్పారు. ఓ డివైడర్‌ని ఢీకొట్టి పూర్తిగా పక్క రోడ్డువైపు కార్ దూసుకెళ్లింది. అక్కడే ఓ చెట్టుని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. ప్రస్తుతం ఈ కార్ ఓనర్ పరారీలో ఉన్నాడు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే..ఆ తరవాతే ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల వద్దకు ఓ బిజినెస్‌మేన్ వచ్చాడు. ఆ కార్ తనదేనని, తన కొడుకే నడిపాడని చెప్పాడు. సడెన్‌గా కార్‌కి అడ్డంగా కుక్క వచ్చిందని, దాన్ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టాడని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Gurugram | A speeding luxury car caught fire & burned to ashes after hitting a tree at Golf Course road, in the early morning hours today. The car also collided with a divider before hitting a tree. The driver fled the spot, no one was injured in the incident pic.twitter.com/FG1ACXbdmB
— ANI (@ANI) May 11, 2023
కార్‌లో మంటలు అందుకే..
ప్రమాద సమయంలో లేదంటే సాధారణంగా కార్లలో మంటలు రావడానికి బేసిక్ రీజన్స్ ఇంధన వ్యవస్థ, లేదంటే విద్యుత్ వ్యవస్థలో లోపాలు. ఎలక్ట్రికల్, ఇంధన ఆధారిత మంటలు తరచుగా తయారీ, డిజైన్ లోపాల వల్ల సంభవిస్తాయి. ఐదు ప్రమాదాల్లో ఇలాంటివి ఒకటి రెండు ఉంటాయని తేలింది. అందుకే, ఇంధన వ్యవస్థ, ఇంజిన్ కంపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే భాగాలను రీకాల్ చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎలక్ట్రికల్, ఇంధన-ఆధారిత మంటలు తరుచుగా సమస్యలు ఉన్న వాహనాల్లోనే ఎక్కువగా సంభవిస్తాయి. విద్యుత్ వ్యవస్థలో లోపాల కారణంగా డాష్ బోర్డ్, దాని చుట్టూ మంటలు చెలరేగుతాయి. ప్రమాదం ఎక్కువగా ఉన్న సమయంలో కేబుల్స్ తెగి, ఇంధనాన్ని మండించే స్పార్క్ లకు కారణం అవుతాయి. ఇగ్నిషన్ సిస్టమ్‌లలో వైరింగ్ తప్పుగా ఉంటే కూడా మంటలు ఏర్పడుతాయి.
Also Read: మసీదులో హిందూ యువతి నమాజ్, చంపేస్తామంటూ బెదిరింపులు - ప్రొటెక్షన్ ఇచ్చిన కోర్టు
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?