అన్వేషించండి

PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సూపర్ హిట్, 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు

PM Surya Ghar Muft Bijli Yojana: సౌరశక్తి ఉత్పాదన కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు దాదాపుగా ఒక కోటిన్నరకి దగ్గరగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటివరకు దాదాపు ఒక కోటి 45 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని మంగళవారం కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ఇందులో 6.34 లక్షల లబ్ధిదారుల ఇళ్లపై సౌర ఫలకాల ఇన్స్టాలేషన్ కూడా పూర్తయినట్లు వెల్లడించింది. నిజానికి ఫైనాన్షియల్ ఇయర్ 2027 వరకు సుమారు కోటి ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ. 75 వేల 21 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించింది. ఈ పథకం ప్రకటించినప్పటి నుంచి జనాలలో ఆసక్తి బాగా రేకెత్తిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అద్భుత స్పందన..
సౌరశక్తి అనేది ఎంతగా వాడుకున్న తరగలేనది. దీనితో పర్యావరణ కాలుష్యం అస్సలు ఉండదు. ఇళ్లల్లో సౌర ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే, థర్మల్, అణు తదితర విద్యుత్ వాడకం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ పథకం కోసం 26.38 లక్షల ధరఖాస్తులు వచ్చాయని, ఓవరాల్ గా కోటి 45 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 

సబ్సిడీ విడుదలకి సిద్ధం..
ఈ పథకం కింద అర్హులైన వారికి త్వరలోనే సబ్సిడీ విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించిన పూర్తి కార్యచరణ రూపొందించినట్లు  కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. 3.66 లక్షల మంది లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీ విడుదల కానుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాలు సమర్థ వంతంగా ఉపయోగించుకుంటున్నాయి. గుజరాత్ లో ఎక్కువగా ఇన్స్టాలేషన్లు జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఓవరాల్ గా రెండు లక్షల 86 వేల 545 ఇన్స్టాలేషన్లు ఈ పథకంలో భాగంగా జరిగాయని పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్రాలో ఒక లక్ష 26 వేల 344 ఇన్స్టాలేషన్లు, ఉత్తర ప్రదేశ్ లో 53 వేల 423 ఇన్స్టాలేషన్లతో టాప్ త్రీలో నిలిచినట్లు తెలిపింది. ఆర్ఈసీ, డిస్కం, వెండార్లలతోపాటు మిగతా స్టేక్ హోలర్డలతో సమష్టిగా ఈ పథకం విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. 

భారీ లక్ష్యం..
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సౌర శక్తి విభాగంలో అద్భుత లక్ష్యాలను సాధించాలని కేంద్రం భావిస్తోంది. సుమారు 500 గిగావాట్ల పునరుత్సాధక శక్తిని 2030 వరకల్లా సాధించాలని టార్గెట్ గా పెట్టుకోంది. ఇందుకోసమే భారీగా సబ్సిడీలను కేటాయిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇండివిడ్యువల్ ఇళ్లు, గ్రూపు హౌసింగ్ సొసైటీలలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం ప్రొత్సహిస్తోంది. మరోవైపు నెట్ మీటరింగ్ వ్యవస్థ ద్వారా తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన కరెంటును అమ్మే అవకాశాన్నికేంద్రం కల్పిస్తోంది. తమ వ్యక్తిగత అవసరాలకు పోను, మిగతా కరెంటును గ్రిడ్ కు సరఫరా చేయడం ద్వారా లభ్ధిదారులు ఆదాయం లభిస్తుందని కేంద్రం చెబుతోంది. ఈ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుని పోయే విధంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తోంది. 
Also Read: Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Harish Rao: కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Rohit Sharma Retirement Plan: రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అభిమానులను సైతం కదిలించిన మాటలు
రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అభిమానులను సైతం కదిలించిన మాటలు
Saudi Arabia: సౌదీలో ఇళ్లల్లో పని చేసే కార్మికులకు గుడ్ న్యూస్ - ఇక అందరికీ ఈ శాలరీ
సౌదీలో ఇళ్లల్లో పని చేసే కార్మికులకు గుడ్ న్యూస్ - ఇక అందరికీ ఈ శాలరీ
Embed widget