భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్, మోదీ 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా విజృంభిస్తున్నా..
ఇరు దేశాల్లోనూ కరోనా విజృంభణ ఉన్నప్పటికీ పుతిన్.. భారత్ వచ్చారు. ముఖ్యంగా భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కూడా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయినప్పటికీ పుతిన్ భారత పర్యటనకు వచ్చారంటే ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కీలకమో అర్థమవుతోంది.
కీలక ఒప్పందాలు..
భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో 6 లక్షలకు పైగా ఏకే203 రైఫిల్స్‌ను భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేయనున్నాయి. ఈ ఒప్పందంపై భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జెనరల్ సెర్గే షోయిగు సంతకం చేశారు.
ఏకే203 రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతకుముందు భారత్, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రాంతీయ శాంతి, సుస్థిరతలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై మంత్రులు చర్చించారు. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులపై ఇరు దేశాల మంత్రులు మధ్య కీలక చర్చ జరిగింది.
ఎప్పటిదో..
భారత్- రష్యా మైత్రి చాలా బలమైనది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఎన్నో కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉంది. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలతో భారత్‌కు ముప్పు పొంచి ఉన్న ప్రతిసారి రష్యా మనకు అధునాతన ఆయుధాలను అందించి ఆదుకుంది. హైపర్‌సోనిక్ ఆయుధాల తయారీలో రష్యాకు సాటి లేదు. అలాంటి దేశంతో మైత్రి భారత్‌కు కీలకం కానుంది.
చైనాతో సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ రష్యా అధ్యక్షుడు స్వయంగా భారత్‌కు రావడం విశేషం. కచ్చితంగా భారత్-రష్యా మైత్రిపై ఇది గొప్ప ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: Sri Lankan National Killed: మూక దాడులకు 'పాపి'స్థాన్ అడ్డా.. ఇదే చివరి అవకాశం బిడ్డా!
Also Read: Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?
Also Read: India-Russia Summit: భారత్- రష్యా మధ్య 4 ఒప్పందాలు.. అమేఠీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఓకే
Also Read: Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'
Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ
Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన
Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?