భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో 6 లక్షలకు పైగా ఏకే203 రైఫిల్స్‌ను భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేయనున్నాయి. ఈ ఒప్పందంపై భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జెనరల్ సెర్గే షోయిగు సంతకం చేశారు.
నాలుగు ఒప్పందాలు..
ఐఆర్ఐజీసీఎమ్-ఎమ్టీసీ(ఇండియా-రష్యా ఇంటర్ గవర్న్మెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్) 20వ సమావేశంలో మొత్తం నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ఏకే203 రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాల్ని చేసుకున్నాయి.
2+2 చర్చలు..
అంతకుముందు భారత్, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రాంతీయ శాంతి, సుస్థిరతలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై మంత్రులు చర్చించారు. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులపై ఇరు దేశాల మంత్రులు మధ్య కీలక చర్చ జరిగింది.
Also Read: Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'
Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ
Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన
Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?