నాగాలాండ్ కాల్పుల ఘటనపై చర్చించేందుకు సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పార్లమెంటులో ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని ఎలా ఉండాలనేదానిపై మంత్రులతో మోదీ చర్చించినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు.


సభలో నిరసన..


నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మధ్యాహ్నం ప్రకటన చేస్తారని భాజపా ఎంపీలు వెల్లడించారు. అయితే ఘటన చాలా సున్నితమైనదని, దాని తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే షా ఇప్పుడే ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై చర్చ జరగాలని నోటీసులు ఇచ్చారు సభ్యులు. ఈ క్రమంలో లోక్​సభ, రాజ్యసభలో విపక్షాలు నిరసనకు దిగాయి. 


నాగాలాండ్‌కు..


తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సహా ఐదుగురు సభ్యుల బృందం నేడు నాగాలాండ్‌ వెళ్లనుంది. బలగాల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను వీరు పరామర్శించనున్నారు.


ఏం జరిగింది?


నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.


Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి