దేశంలో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదుకాగా 211 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 8,834 మంది కరోనా నుంచి రికవరయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 552 రోజుల కనిష్ఠానికి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 98,416 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






మొత్తం కేసులు: 34,641,561‬


మొత్తం మరణాలు: 4,73,537


యాక్టివ్​ కేసులు: 98,416


మొత్తం కోలుకున్నవారు: 3,40,69,608







వ్యాక్సినేషన్..


దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆదివారం 24,55,911 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,27,93,09,669కి చేరింది.


ఒమిక్రాన్ కేసులు.. 


దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు నిర్ధరణయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి మహారాష్ట్ర వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వైరస్‌ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది. 


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి