కియా కొత్త ఎంపీవీ కారు క్యారెన్స్‌గా నిర్ణయించనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పేరుతో కియా కారు ప్రపంచంలోని వేర్వేరు మార్కెట్లలో ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఇప్పుడు దాన్ని భారతదేశానికి కూడా తీసుకున్నారు.


కియాకు క్యారెన్స్ కారు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈసారి కియా ఎంపీవీ సెగ్మెంట్లో పోటీ పడనుంది. పెద్దదిగా చేసిన సెల్టోస్ మాదిరిగా కాకుండా.. కొత్త ఎంపీవీ తరహా వెర్షన్‌లో ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది.  ఇందులో కొత్త తరహా లుక్, కొత్త తరహా ఇంటీరియర్ ఉండనుందని తెలుస్తోంది.


ఈ కారు వీల్ బేస్ పెద్దగా ఉండనుంది. అలాగే ఇంతకు ముందు వాటికంటే లగ్జరీగా కూడా ఉండనుంది. క్యారెన్స్‌లో మూడు వరుసలు ఉండవచ్చు. అయితే 6 సీటరా లేదా 7 సీటరా అనేది తెలియాల్సి ఉంది. టాప్ ఎండ్ వేరియంట్‌లో కెప్టెన్ సీట్లు, మరిన్ని ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.


దీని ఇంటీరియల్ సెల్టోస్ కంటే డిఫరెంట్‌గా ఉండనుంది. వైర్‌లెస్ చార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్ యూవీఓ, 360 డిగ్రీల కెమెరా, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. దీంతోపాటు రెండో వరుసలో కూర్చునే ప్యాసింజర్లకు కప్ హోల్డర్ల వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.


ఎక్స్ఎల్6 లేదా ఇన్నోవా క్రిస్టాలతో క్యారెన్స్ పోటీ పడే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కానీ 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ కానీ అందించనున్నారు. ఈ రెండు ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ ఇంజిన్లు అందించనున్నారు. సెల్టోస్ తరహాలో ఇందులో టర్బో పెట్రోల్ వేరియంట్ ఉండకపోవచ్చు. ఈ కారు లాంచ్ డిసెంబర్ 16వ తేదీన జరిగే అవకాశం ఉంది. సేల్ మాత్రం 2022లోనే ప్రారంభం కానుంది.


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి