కొత్త మారుతి సెలెరియో కార్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. అయితే మొదట రూపొందించిన కొన్ని కార్లు ఇప్పటికే డీలర్ల దగ్గరకు చేరిపోయాయి. వీటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఈ కొత్త సెలెరియో తక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న వేరియంట్లను కూడా ఇందులో చూడవచ్చు.


ఈ కొత్త సెలెరియో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారు. వాగన్ ఆర్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. ఈ కార్ చూడటానికి కాస్త వెడల్పుగా కనిపిస్తోంది. లుక్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ముందువైపు గ్రిల్‌ను కొత్తగా అందించారు. హెడ్ ల్యాంప్స్ కూడా కొంచెం పెద్దగా కనిపించనున్నాయి.


ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెలెరియోకు బాక్స్ తరహాలో లైన్స్ అందించారు. దీని రూఫ్ లైన్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఇందులో వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ కాస్త పెద్దగా ఉండనున్నాయి. వెనక నుంచి ఈ కొత్త సెలెరియో చూడటానికి ప్రీమియం తరహాలో ఉంది. టాప్ ఎండ్ వేరియంట్లకు కూడా 14 అంగుళాల అలోయ్ వీల్స్ అందించనున్నారు.


ఇది వీటిలో మిడ్ స్పెసిఫికేషన్ వేరియంట్. దీని డిజైన్ మారిన విషయాన్ని కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇందులో బ్లాక్ థీమ్ ఉంది కానీ అక్కడక్కడా సిల్వర్ ఎలిమెంట్స్‌ను కూడా చూడవచ్చు. డ్రైవర్ డయల్స్‌కు చిన్న డిజిటల్ స్క్రీన్‌ను అందించారు. టాప్ ఎండ్ వేరియంట్‌లో టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇందులో మారుతి ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఉండనుంది.


అయితే మిడ్ స్పెక్ వేరియంట్‌లో మాత్రం టచ్ స్క్రీన్ అందించలేదు. టాప్ ఎండ్ వేరియంట్‌లో బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అందించారు. వెనకవైపు కెమెరా డిస్‌ప్లే ఉంది. కొత్త సెలెరియోలో 1.21 పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఏఎంటీ, మాన్యువల్ గేర్ బాక్స్ చాయిసెస్‌లో ఈ కార్ అందుబాటులో ఉంది.


ఇందులో 1.01 పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. అయితే లోయర్ స్పెసిఫికేషన్ వేరియంట్‌లో మారుతి ఏఎంటీ ఆప్షన్ అందించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త సెలెరియో ధర కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి