ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,532 నమూనాలు పరీక్షించగా 220 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మరణించారని తెలిపింది. కరోనా నుంచి 429 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,142 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌ వల్ల చిత్తూరు, కృష్ణా, ప్రకారం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని పేర్కొంది.


Also Read: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,670కి చేరింది. వీరిలో 20,48,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 429 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,142 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,377కు చేరింది. 


Also Read: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు


తెలంగాణలో కొత్తగా 160 కరోనా కేసులు 


తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 160 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,326 శాంపిల్స్‌ పరీక్షించగా 160 మందిలో వైరస్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా 193 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 2.76 కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించారు. 6.71లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వారిలో 6.63 లక్షల మందికి పైగా కోలుకున్నారు. 3958 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3974 క్రియాశీల కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.81శాతం, మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


Also Read:  కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి