కరోనా టీకా కొవాగ్జిన్​ను ఆస్ట్రేలియా సహా మరో ఐదు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాయి. ఎస్తోనియా, కిర్గిజిస్థాన్, స్టేట్ ఆఫ్ పాలస్తైన్,, మారిషస్, మంగోలియా దేశాలు ఈ మేరకు కొవాగ్జిన్‌ గుర్తిస్తూ ప్రకటన విడుదల చేశాయి. భారత్​ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు తమ దేశాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉందని తెలిపాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.






ముందుగా ఆస్ట్రేలియా..


కొవాగ్జిన్‌ను అధికారికంగా గుర్తిస్తూ ఈరోజు ఉదయం ఆస్ట్రేలియా ఔషధ, వైద్య పరికరాల నియంత్రణ సంస్థ- థెరపీటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 


కొవాగ్జిన్, చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ టీకా​ తీసుకున్న 12 ఏళ్లు పైబడిన వారు, బీబీఐబీపీ టీకా తీసుకున్న 18-60 ఏళ్ల మధ్య వయస్సుల వారు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.


కొవాగ్జిన్​ టీకాను డబ్ల్యూహెచ్​ఓ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. అయితే నిపుణుల కమిటీ వద్ద ఇది పెండింగ్‌లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం చాలా రోజుల నుంచి కొవాగ్జిన్‌ను తయారు చేసిన భారత్ బయోటెక్, భారత్ ఎదురుచూస్తోంది.


Also Read: 2013 Patna Gandhi Maidan Blasts: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు


Also Read: UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'


Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!


Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు


Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?


Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి