ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. యూపీలో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
ఇప్పటికే మహిళలకు రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
కీ పాయింట్స్:
- ఆశా, అంగన్‌వాడీ మహిళలకు ప్రతి నెల రూ.10 వేల గౌరవవేతనం.
- కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు రిజర్వేషన్.
- ఓల్డ్-విడో పింఛను కోసం ప్రతి నెల రూ.1000
- రాష్ట్రంలోని ప్రముఖ ఫిమేల్ ఐకాన్స్ పేరుతో 75 నైపుణ్య పాఠశాలలు ప్రారంభం.
- విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు పంపిణీ
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు