YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఒకటో తేదీ నుంచే సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందేలా చేస్తున్నారు. ఏపీలో నేటి (నవంబర్ 1) ఉదయం నుంచే వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మొదలైంది. దాదాపు 61 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్ నగదు అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 


గత కొన్ని నెలలుగా నెల ఒకటో తేదీ నుంచే వైఎస్సార్ పెన్షన్ కానుకను లబ్దిదారులకు అందిస్తున్నారు. ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు నేటి తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం 60,65,526 మంది లబ్దిదారులకు వైఎస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా రూ.1417.53 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా తొలిరోజే సగానికిపై పైగా లబ్దిదారులకు పింఛన్ అందేలా వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు.


Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 


బయోమెట్రిక్ విధానం అమలు
ఏపీలో పింఛన్ల లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలను అమలు చేస్తున్నారు.  ఆర్‌బీఐఎస్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సొంతూళ్లలో నివాసం ఉన్నప్పటికీ, ఏదైనా కారణాలతో బయటి ప్రాంతాలకు వెళ్లిన వారికి సైతం పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సాంకేతితతో అసలైన లబ్ధిదారులకు ఏ సమస్యా లేకుండా పెన్షన్ అందించడం తేలిక అవుతుందన్నారు. నెల మొదటి మూడు రోజుల్లోనే పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం పింఛన్ అందేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


Also Read: దంతేరాస్ వేళ బంగారం ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి లేటెస్ట్ రేట్లు ఇవే 


Also Read: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి