ఆంధ్రప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతున్నాయి. గత వారం తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో బృందం ఈసీని కలిసి విజ్ఞప్తి పత్రాన్ని ఇచ్చింది. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.  ఎంపీలు కడనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని ఈసీని కలిసిన బృందంలో ఉన్నారు. 


Also Read : హుజూరాబాద్, బద్వేల్ కౌంటింగ్ కౌంట్ డౌన్ ... మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర...


ఆంధ్రప్రదేశ్‌లో గత రెండున్నరేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలపై జరిపిన దాడుల గురించి ఓ సమగ్రమైన నివేదికను టీడీపీ నేతలు ఈసీకి అందించారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ఆ పార్టీ ఎంతగా దాడికి పాల్పడుతుందో కూడా వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై దాడులు, పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో గుప్పిట్లో పెట్టుకుని బాధితులపైనే దాడులకు పాల్పడటం వంటి అంశాలను కూడా తమ ఫిర్యాదులో టీడీపీ నేతలు వివరించారు. అన్ని అంఁశాలు పరిశీలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. 


Also Read: బద్వేల్ లో బైపోల్ కాదు బస్ పోల్... వైసీపీ భారీగా రిగ్గింగ్ పాల్పడిందని బీజేపీ ఆరోపణ... రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్


డ్రగ్స్ కేసు విషయంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా దూషించారన్న కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టాభిరామ్ ఇంటిపైనా, టీడీపీ ఆఫీస్‌పైన దాడి చేయడంతో వివాదం ప్రారంభమయింది. వైఎస్ఆర్‌సీపీ టెర్రరిస్ట్ ఎటాక్స్ అంటూ టీడీపీ ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రపతికి, హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. రాష్ట్రపతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం ఫిర్యాదుచేసింది. పోటీగా వైఎస్ఆర్‌పీసీ నేతలు కూడా ఢిల్లీలో ఫిర్యాదులు ప్రారంభించారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


ముందుగా ఎన్నికల సంఘాన్న కలిసి టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారని ఆ ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. పోటీగా టీడీపీ నేతలు కూడా ఫిర్యాదులు చేశారు. రాజకీయం రాజుకుంటున్న కొద్దీ తమ పోరును ఢిల్లీకి చేర్చుకుంటున్నాయి ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు. 


Also Read : మాకు డెడ్ లైన్‌ పెట్టడానికి నువ్వెవడివి ? పవన్‌పై మంత్రి అప్పలరాజు ఫైర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి