అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో భారతదేశంలోని స్వీడన్ ఎంబసీ 'స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ వీక్ 2021' కింద విద్యార్థుల కోసం ఓ పోటీని ప్రారంభించింది. విద్యార్థులు ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేయాల్సి ఉంటుంది. #SHEStem Insta-Reels Challenge పేరుతో స్వీడన్ ఎంబసీ పోటీ పెట్టింది.
STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) లీడర్‌గా, STEM ద్వారా ప్రపంచాన్ని మీరు ఎలా మంచి ప్రదేశంగా మార్చుతారు? అనేది ప్రశ్న. అయితే ఎంట్రీలను పంపేటప్పుడు విద్యార్థుల సృజనాత్మకతను కూడా ఇక్కడ గమిస్తారు. వారు చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది.
విద్యార్థులు ఎలా పాల్గొనవచ్చు?
- STEM లీడర్‌గా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి STEMని ఎలా ఉపయోగిస్తారు.. అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇన్‌స్టా-రీల్ వీడియోను రికార్డ్ చేయాలి.
- వీడియో తప్పనిసరిగా..'ఇది 2040 మరియు నేను' అనే పదాలతో మెుదలు పెట్టాలి. అయితే, రీల్ తప్పనిసరిగా మూడు పదాలతో కంప్లీట్ చేయాలి. ఏం స్ఫూర్తినిస్తుంది.. ఏం చేయాలి అని కూడా చెప్పాలి.
- ఇన్‌స్టా-రీల్ గరిష్టంగా 30 సెకన్ల నిడివి ఉండాలి. దీన్ని ఇన్‌స్టా-పోస్ట్‌గా సేవ్ చేయడం గుర్తుంచుకోవాలి.
- రీల్ పోస్ట్‌ను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, #SHESTEM2021, #SwedenIndiaSambandh, #SwedenIndiaforInnovation అనే హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
- పాల్గొనేవారు పోస్ట్‌లో కనీసం ఐదుగురు స్నేహితులను ట్యాగ్ చేయాలి.
ఎవరు పాల్గొనవచ్చు..
- అక్టోబర్ 30, 2021 నాటికి 13-17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పోటీలో పాల్గొనవచ్చు.
- వ్యక్తిగతంగా మాత్రమే పోటీలో పాల్గొనాలి.
- ప్రస్తుతం భారతదేశంలోని పాఠశాలలో చదువుతున్న వారే పాల్గొనాలి.
- ఒక్కరికి ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
- ఇన్ స్టా-రీల్ పోటీ ఎంట్రీలు తప్పనిసరిగా ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే చేయాలి.
పోటీ 2040లో జరిగినట్లుగా చెప్పడం వలన.. విద్యార్థులకు ఊహా శక్తి పెరుగుతుంది. ఆలోచనలో కొత్తదనం, స్పష్టత, విద్యార్థుల ఉచ్ఛారణ విధానం లాంటివి అంచనా వేస్తారు. ప్రతి రోజు అన్ని ఎంట్రీలలో ఒక ఇన్‌స్టా-రీల్ షార్ట్‌లిస్ట్ చేస్తారు. చివరగా, షార్ట్‌లిస్ట్ చేయబడిన 15 రీల్స్ నుండి ఒక విజేత ఎంపిక చేస్తారు. విజేతకు మొదటి బహుమతిగా టాబ్లెట్ అందిస్తారు. ఇతర షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఇతర బహుమతులు అందించనున్నారు. పోటీలో విజేతలను డిసెంబర్ 6న SHE STEM 2021 లైవ్ ఈవెంట్‌లో ప్రకటిస్తారు. వారి ఇన్‌స్టా-రీల్స్ కూడా ప్లే చేస్తారు.
Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి