రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. దీనికి అనుగుణంగా.. ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఈ విద్యా సంవత్సరంలో కొత్త బీటెక్ ప్రోగ్రామ్స్ ను ప్రారంభిస్తున్నాయి. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్స్ బేస్ చేసుకుని.. ఇందులో అడ్మిషన్లు ఉంటాయి.
ఐఐటీ హైదరాబాద్ ఈ సంవత్సరం నుంచి బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో 3 కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఒక్కో కోర్సులో 10 సీట్లను మాత్రమే ఉన్నాయి. మెల్లమెల్లగా.. సీట్ల సంఖ్యను పెంచనున్నారు.
కంపెనీలు నూతన టెక్నాలజీస్‌పై పనిచేస్తున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఉద్యోగానికి అవసరమయ్యే కోర్సులు నేర్చుకున్న వారికే అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. రెండేళ్ల నుంచి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఐటీ కోర్సులకు దృష్టి సారించామని.. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫార్మా కంపెనీలు, పాలిమర్ పరిశ్రమలకు సంబంధించిన కోర్సులపై దృష్టి పెట్టినట్టు చెప్పారు.
ఐఐటీ గౌహతి, ఐఐటీ పాట్నా ఇటీవలే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ కోర్సులను ప్రారంభించాయి. ఐఐటీ కాన్పూర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ను మెుదలుపెట్టింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి సైన్స్ కోర్సులను, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రోగ్రామ్‌లు రూపొందించారు. ఐఐటీ ఢిల్లీ కూడా 40 సీట్లతో ఎనర్జీ ఇంజనీరింగ్‌లో కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఏటా.. కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తున్నట్టు ఐఐటీ గౌహతి చెప్పారు. జేఈఈ టాప్ ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్‌ను మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారని.. ఐటీ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశం ఎక్కువగా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే