నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. నీట్-యూజీ 2021 ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్షకు 202 నగరాల్లోని 3682 సెంటర్లలో 16,14,777 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఎందుకు ఆపారంటే?
మహారాష్ట్రలోని ఓ సెంటర్లో ఇద్దరు అభ్యర్థుల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారు అయ్యాయి. దీంతో వీరిద్దరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఆదేశించింది. అప్పటివరకు నీట్ ఫలితాలను నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది
అయితే ఈ నిర్ణయంపై ఎన్టీఏ సుప్రీంను ఆశ్రయించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేయలేమని పేర్కొంది. ఆ ఇద్దరు అభ్యర్థుల విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి