ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (రిమ్స్) తొలిసారి బాలికలకూ ప్రవేశం కల్పిస్తోంది. 2022-జులై టెర్మ్ కోసం ఏడో తరగతి పూర్తి చేసిన బాలికలను ఎనిమిదో తరగతిలో చేర్చుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో చేరాలనుకునే బాలికలు నవంబర్ 15లోపు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 18న ఎవరి సొంత రాష్ట్రాల్లో వారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
అర్హతలు
రిమ్స్ లో చేరాలనుకునే బాలికలకు 2022 జూలై 1 నాటికి 13 ఏళ్లు దాటి ఉండకూడదు. 2009 జూలై 2 లేదా అంతకన్నా ముందు జన్మించి ఉండాలి. ఆ తేదీ తరువాత జన్మించిన వారు అర్హులు కారు. 2022 జూలై 1 నాటికి ఏడో తరగతి పాసై ఉండాలి.
పరీక్ష విధానం
మేథమేటిక్స్, జనరల్ నాలెడ్జి, ఆంగ్ల సబ్జెక్టుల ఆధారంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. డిసెంబర్ 18న ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన బాలికలకు ఇంటర్య్వూ కూడా ఉంటుంది. 2022లో మార్చిలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్య్వూలలో కూడా ఉత్తీర్ణులైన వారికి మిలిటరీ ఆసుపత్రిలలో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక ఎంపికైన వారి వివరాలు రిమ్స్ వారి అధికారిక వెబ్ సైట్లో పెడతారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
'www.rimc.gov.in'అధికారిక వెబ్ సైట్లో అన్ని వివరాలు ఉంటాయి. దరఖాస్తు ఫారాల కోసం జనరల్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. దరఖాస్తు ఫారాలను నింపాక వాటితో పాటూ, వారు అడిగిన ధ్రువపత్రాల జిరాక్సులను, పాస్ పోర్టు సైజు ఫోటోలను కలిపి నవంబర్ 15లోపు వారికి చేరేలా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
అసిస్టెంట్ సెక్రటరీ (పరీక్షలు), ఏపీపీఎస్సీ
న్యూ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బిల్డింగ్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా,
ఎంజీ రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
–520010
Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!
Also Read: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. తేదీలు, పూర్తి వివరాలివే
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు