TS EAMCET 2021 Counselling Dates: తెలంగాణలో ఎంసెట్‌ 2021 ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్ శుక్రవారం వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్స్ ఈ నెల 25, 26 తేదీలలో జరుగుతాయి. చివరగా నవంబరు 14వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ లో తెలిపారు.


ఇదివరకే కౌన్సెలింగ్ ప్రారంభం కాగా.. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించారు. ఆపై 18న ఇంజనీరింగ్‌ మొదటి విడత సీట్లను కేటాయించారు. తాజాగా తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్‌ 2వ తేదీన ఇంజినీరింగ్‌ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. నవంబర్‌ 12న స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.


Also Read: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్.. పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు






ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ తుది షెడ్యూల్..



  • అక్టోబర్ 25, 26 తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్స్

  • అక్టోబర్ 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన

  • అక్టోబర్ 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి

  • నవంబర్‌ 2వ తేదీన ఇంజినీరింగ్‌ తుది విడత సీట్ల కేటాయింపు

  • నవంబర్‌ 9వ తేదీ నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌ ప్రారంభం

  • నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు.

  • నవంబర్‌ 12న స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ

  • నవంబరు 14వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల చేయనున్నారు.


Also Read: ఏడో తరగతి పూర్తైన బాలికలకు అద్భుత అవకాశం.. RIMCలో ప్రవేశానికి TSPSC ప్రకటన జారీ 


తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పరీక్షలకు 1,47,991 మంది హాజరైతే 1,21,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 79,009 మంది హాజరవ్వగా 73,070 మంది (దాదాపు 92.48 శాతం) అర్హత సాధించారు.  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి