డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ ఎనిమిదో తరగతిలో బాలికల ప్రవేశానికి సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది. RIMC వెబ్ పోర్టల్లో దరఖాస్తు ఫీజు చెల్లించి ఫాంతో పాటూ ప్రాస్పెక్టస్, ఓల్డ్ మోడల్ పేపర్స్ ఉన్నబుక్ లెట్ పొందవచ్చు. దరఖాస్తుల్ని నవంబరు 15లోగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి పంపించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. తాము సూచించిన అడ్రస్ కు పంపించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
బాలికలు ఎలా అప్లై చేసుకోవాలంటే...
అర్హత- గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జూలై 1 నాటికి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు- ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేనాటికి బాలికలకు పదకొండున్నరేళ్లు ...ఎనిమిదో తరగతిలో ప్రవేశం నాటికి పదమూడేళ్లు నిండి ఉండాలి. అంటే 2009 జూలై 2 కన్నా ముందు..2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్
మొత్తం మార్కులు 400. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ కు 125, మ్యాథ్స్ కి 200, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్ పేపర్ కు గంటన్నర, జీకేకి గంట , ఇంగ్లీష్ పేపర్ కి రెండు గంటల సమయం ఇస్తారు. ఇంగ్లీష్ మినహా మిగిలిన రెండు పేపర్లను హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లో కనీసం 50శాతం మార్కులు రావాలి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్, వైవాలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.
ముఖ్యమైన వివరాలు
దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు రూ.555
దరఖాస్తు కి చివరి తేదీ-నవంబరు 15
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ-డిసెంబరు 18
పంపించాల్సిన చిరునామా- తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పంపించాల్సిన చిరునామా- APPSC, న్యూ HOD భవనం, 2 వ అంతస్తు, RTA కార్యాలయం దగ్గర, మహాత్మాగాంధీ రోడ్, విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ బాలికల పరీక్ష కేంద్రం- విజయవాడ
తెలంగాణ బాలికల పరీక్ష కేంద్రం- హైదరాబాద్
వెబ్ సైట్- tspsc.gov.in, rimc.gov.in
Also Read: అక్టోబర్ 25 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలు
Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!
Also Read: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సెమిస్టర్-1 పరీక్షలు వాయిదా.. CISCE అధికారిక ప్రకటన
Also Read: ఐఐటీ కుర్రాడు సివిల్స్ సాధించాడు.. తన విజయంపై ఏమన్నాడంటే!
Also Read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి