కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని " దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా"గా పేరు మారుస్తామమని ప్రకటించారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనన్నారు.
ఎందరో మహానుభావుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు పవన్ కల్యాణ్. తెలుగు వారు కలిసుండాలని పదవిని తృణప్రాయంగా వదులుకున్న బూర్గుల రామకృష్ణరావు, ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించిన పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులతో పాటు పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ దామోదరం సంజీవయ్య లాంటి మహానీయులు స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు.
https://www.youtube.com/watch?v=wfpk-N5Fedo&feature=youtu.be
Also Read: అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న
సంజీవయ్య గురించి రెండున్నర దశాబ్దాలుగా వింటున్నానని, మేధావులు, విద్యావేత్తలు, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, విశ్రాంత అధికారులు సంజీవయ్య విశిష్టతను, పాలన దక్షతను చెబుతున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన కేవలం రెండేళ్లే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి, మరువలేనివి అని పవన్ అన్నారు. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు, వెనకబడిన వర్గాలు, కులవృత్తులు చేసుకొనేవారికీ, పేదలకు పంచారని చెప్పారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులిచ్చారని చెప్పారు.
Also Read: చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !
ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు…కానీ ఏ ఒక్కరు కూడా సంజీవయ్య ఇంటిని పట్టించుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరును ఏ పథకానికి పెట్టలేదన్నారు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలని నిర్ణయానికి వచ్చామని జనసేన పార్టీ ద్వారా కోటి రూపాయల నిధులు సమకూర్చి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి