వాట్సాప్.. మన జీవితంలో ఓ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తున్నవారే. అయితే అందులో మనం ఒకరికి పెట్టే మెసేజ్‌లు, సమాచారం సురక్షితమేనా? మరి అప్పుడప్పుడు సెలబ్రెటీల వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లు నెట్టింట్లో ఎలా ప్రత్యక్షమవుతున్నాయి అబ్బా? అవును కదా ఈ డౌట్ వచ్చిందా మరి ఎప్పుడైనా?


ఈ ప్రశ్న చాలా సార్లు మనకు వచ్చే ఉంటుంది. అయితే ఈ ప్రశ్న ఎన్నిసార్లు వచ్చినా.. దానికి వాట్సాప్ సమాధానం మాత్రమే ఒక్కటే. వాట్సాప్ 'ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' అని చెబుతుంటారు. అంటే మనం పెట్టిన మెసేజ్‌ మనకు, రిసీవ్ చేసుకున్నవారికి తప్ప ఇంకెవరికీ తెలియదని అర్థం. అంటే వాట్సాప్ కూడా ఆ సందేశాల్ని చదవలేదట. ఇంత వరకు బాగనే ఉంది. మరి ఈ సెలబ్రెటీల వాట్సాప్ ఛాట్‌ లీక్ సంగతేంటి?


వీటి సంగతేంటి..?


బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ సందేశాలు 2020లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత దీపికా పడుకొనే ఎవరో డ్రగ్ డీలర్‌తో చేసిన వాట్సాప్ మెసేజ్‌లు లీక్ అవడం వల్ల ఎన్‌సీబీ కార్యాలయానికి కూడా వెళ్లింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే కూడా ఈ వాట్సాప్ ఛాట్ లీక్ కారణంగానే ఎన్‌సీబీ అధికారులను కలిసింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో అనన్యా పాండే డ్రగ్స్ గురించి చేసిన వాట్సాప్ ఛాట్ అధికారుల చేతికి చిక్కింది. 


ఇవన్నీ చూస్తుంటే అసలు ఒకరికి పర్సనల్‌గా చేసిన మెసేజ్‌లు ఇలా పబ్లిక్‌ ఎలా అయ్యాయి అని అనుమానం వస్తుంది. అసలు ఇవి ఇతరుల చేతికి ఎలా చిక్కాయి?


వాట్సాప్ సురక్షితమేనా? 


ఈ ప్రశ్న ఉత్పన్నమైన ప్రతిసారి వాట్సాప్ చెప్పే కథ ఒక్కటే. మా వాట్సాప్‌ చాలా సురక్షితం. మీరు పెట్టే మెసేజ్‌లూ, చేసే కాల్స్ అన్నీ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని చెబుతోంది. కనీసం ఫేస్‌బుక్, వాట్సాప్ కూడా వీటిని చూడలేదన్నది సంస్థ వాదన. ఓ సిగ్నల్ ప్రోటోకాల్ ప్రకారం.. థర్డ్ పార్టీలు కానీ వాట్సాప్ సైతం వీటిని యాక్సస్ చేయలేదు అని సంస్థ బలంగా చెబుతోంది.


మరి బయటకు ఎలా వచ్చాయి?


మరి వాట్సాప్ చెబుతోంది నిజమే అయితే.. ఈ మెసేజ్‌లు ఎలా లీక్ అయ్యాయి? దీనికి మరో దారి ఉంది. అదేంటంటే ఇవి లీక్ అవలేదు. ఈ మెసేజ్‌లను ఎవరో యాక్సస్ చేశారు. ఇది ఎలా జరిగింది అంటే.. ఎవరో వీరి మొబైల్‌ను అన్‌లాక్ చేసి ఈ మెసేజ్‌లను సంపాదించారన్నమాట. భారత్‌లో ఎవరిపైనన్న పోలీసులకు అనుమానం వస్తే వారి స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లను సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి చట్టాలు అలా ఉన్నాయి. కానీ అమెరికా, ఐరోపా దేశాల్లో ఎవరివైన మొబైల్, కంప్యూటర్లు సీజ్ చేయాలంటే వారెంట్ కచ్చితంగా కావాలి.


కనుక ఇలా వారి మొబైల్స్‌ సీజ్ చేసి వారి చేతే అన్‌లాక్ చేయించి వాట్సాప్ సందేశాలను అధికారులు యాక్సస్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్‌ తీసుకుంటున్నారు. అవే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఇక్కడ ఇంకో దారి కూడా ఉంది. ఫోరెన్సిక్ బృందాలు.. ఈ వాట్సాప్ మెసేజ్‌లను యాక్సస్ చేయలేకపోయినా.. ఎప్పటికప్పుడు ఇవి గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ అవుతాయి. అప్పుడు వాటిని కొన్ని ప్రత్యేక టూల్స్ ద్వారా ఫోరెన్సిక్ అధికారులు యాక్సస్ చేయగలరు.


కోర్టు ద్వారా..


దర్యాప్తు సంస్థలు, పోలీసులు తమకు కావాల్సిన సమాచారం కోసం కోర్టు అనుమతితో గూగుల్, యాపిల్ సంస్థలను సంప్రదించి ఈ డేటాను తీసుకోవచ్చు. ఇలా వాట్సాప్ ఛాట్ బ్యాకప్స్‌ను సంపాదించవచ్చు. 


Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ


Also Read: Overthinking Impact: అతిగా ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మ.. బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి!


Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి