నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెగా జాబ్ మేళాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో జాబ్ మేళాకు తరలివచ్చారు. ఈ జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 20కి  పైగా మల్టీ నేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాయి.  అంతకు ముందు ఆత్మకూరు పట్టణ పరిధిలో వాటర్ ఏటీఎంలను మంత్రి ప్రారంభించారు. ప్రజలంతా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 




Also Read: ప్రశాంతమైన కుప్పంలో రౌడీ రాజ్యం .. ఓటుతో బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపు !


75 శాతం ఉద్యోగాలు స్థానికులకే


మంత్రి మేకపాటి మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో నైపుణ్యం ఉన్న యువతకు ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యతలపై శిక్షణ ఇచ్చి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలపై వైసీపీ సర్కారు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. యువత ఉద్యోగాలు సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ భాగంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 


Also Read: శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 1085 ఉద్యోగాలు భర్తీ.. టెన్త్ పాస్ అయిన వాళ్లకు కూడా..


20కి పైగా కంపెనీలు


20కి పైగా కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొని అర్హులైన 1040 మంది యువతీయువకులకు ఉద్యోగాలు కల్పి్స్తున్నాయి.  కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు, కొత్తగా కొలువు కోరుకొనే ఆత్మకూరు నియోజకవర్గ యువతీ యువకులు, నెల్లూరు జిల్లా నిరుద్యోగులూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా, బజాజ్, హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, మెడికవర్, హెటెరో ఫార్మా వంటి కంపెనీలు పాల్గొన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. 


Also Read: నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా.. 20 టాప్ మోస్ట్ కంపెనీలు, వెయ్యికి పైగా పోస్టులు... ఎప్పుడంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి