ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఇవాళ (సెప్టెంబర్ 18) శ్రీకాకుళంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) వెల్లడించింది. శ్రీకాకుళంలోని గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీలో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పేటీఎం, మణప్పురం గోల్డ్, కియా మోటార్స్, అపోలో ఫార్మసీ లాంటి సంస్థల్లో ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలు, రిజిస్టర్ ప్రక్రియ కోసం https://apssdc.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. 


జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీలు, వేతనాల వివరాలు..
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 నుంచి రూ.15,000 వేతనం అందిస్తారు.
Kia Motors: కియా మోటార్స్‌లో మొత్తం 50 ఖాళీలు (ట్రైనీ ఉద్యోగాలు) ఉన్నాయి. డిప్లొమా మెకానికల్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైన వారికి నెలవారీ రూ.13,500 వేతనం అందిస్తారు. 
Apollo Pharmacy: అపోలో ఫార్మసీలో మొత్తం 30 ఖాళీలున్నాయి. ఫార్మసీ ట్రైనీ, ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు ఐటీఐ, బీఫార్మసీ ఉత్తీర్ణలు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
Miracle Software Systems: మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో 100 ఖాళీలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ట్రైనీ, యూఎస్ ఐటీ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారి వార్షిక వేతనం రూ.1,40,000 నుంచి రూ.3,00,000 వరకు ఉంటుంది.
Paytm: డిగ్రీ విద్యార్హతతో పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనం అందిస్తారు.
Manappuram Gold: మణప్పురం గోల్డ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్, జూనియర్ అసిస్టెంట్ (మొత్తం 10 ఖాళీలు) పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలవారీ వేతనం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది. 
Deccan Fine Chemicals: డెక్కన్ ఫైన్ కెమికల్స్‌లో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్ అండ్ డీ, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ పోస్టులకు గానూ బీఎస్‌సీ, ఎంఎస్సీ, బీ పార్మసీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.21,000 వరకు వేతనం లభిస్తుంది.
Gems Hospital: జెమ్స్ హాస్పిటల్స్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులను (20 ఖాళీలు) భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.14,000 వరకు వేతనం ఇస్తారు.
Raxa Securities: రాక్సా సెక్యూరిటీస్ సొల్యూషన్‌లో సెక్యూరిటీ గార్డ్ పోస్టులు 50 ఉన్నాయి. టెన్త్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 వేతనం అందిస్తారు.
Medha Servo: మేధా సెర్వో డ్రైవ్స్‌లో 40 టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులున్నాయి. డిప్లొమా విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక వేతనం రూ.2,49,000 వరకు లభిస్తుంది.
BN Infotec Solutions: బీఎన్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్‌లో  కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను (80 ఖాళీలు) భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్ పాస్ అయినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1,80,000 వరకు వార్షిక వేతనం అందిస్తారు. 
Avantel Limited: అవాంటెల్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు 25 ఉన్నాయి. బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.15,000 వేతనం లభిస్తుంది.


Also Read: Tech Mahindra Jobs: డిప్లొమా, డిగ్రీ అర్హతతో టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. రూ.1,64,000 జీతం..


Also Read: Assam Rifles Recruitment 2021: టెన్త్ అర్హతతో 1230 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?