పండగల సీజన్ కదా.. మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దేశరాజధానిలో మార్కెట్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. అయితే కొవిడ్ దృష్ట్యా నిబంధనలు పాటించని వారిపై.. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చలాన్లు జారీ చేస్తున్నారు. ఒక్క ఆదివారం రోజునే.. 251 మందికి చలాన్లు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిలో ఎక్కువ మంది మాస్క్ లేని వారే. అదే సమయంలో, సామాజిక దూరాన్ని పాటించని ముగ్గురికి కూడా జరిమానా విధించారు.


పండగల దృష్ట్యా చాలామంది జనాలు.. ఆదివారం ఢిల్లీలోని సదర్ బజార్‌లో గుమిగూడారు. చాలామంది మాస్కులు లేకుండా..,  సామాజిక దూరాన్ని పాటించలేదు. దీంతో.. పోలీసులు.. చలాన్లు జారీ చేశారు. ఏప్రిల్ 19 నుంచి అక్టోబర్ 31 వరకు, 3.14 లక్షలకు పైగా చలాన్లు వేశారు పోలీసులు. వీరిలో మాస్కులు ధరించని 2.77 లక్షల మంది ఉన్నారు. సామాజిక దూరం పాటించనందుకు 30,364 మందికి ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,464 మంది బహిరంగ సభలు ఏర్పాటు చేసినందున చలాన్లు ఇచ్చారు. 


ఢిల్లీలో కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించాలని దుకాణదారులు, కస్టమర్‌లను కోరుతూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నిబంధనలను పాటించేలా చేసేందుకు మార్కెట్‌లలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే పండగల సీజన్ కావడంతో జనాలు ఎక్కువగా గుమిగూడుతున్నారు. ఢిల్లీలోని సదర్ బజార్‌లోనే కాకుండా లజ్‌పత్‌నగర్‌, కరోల్‌బాగ్‌లలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు షాపింగ్ కోసం వస్తున్నారు. 
ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, సరోజిని, చాందినీ చౌక్ మొదలైన ముఖ్యమైన మార్కెట్‌ ప్రదేశాలకు జనాలు ఎక్కువగా వస్తున్నారు. అయితే కొంతమంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. థర్ట్ వేవ్ ముప్పు ఉందనే వార్తల కారణంగా.. నిబంధలను పాటించాలని పోలీసులు కోరుతున్నారు. 


Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు


Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?


Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి