హ్యుండాయ్ క్రెటా కారు ప్రస్తుతం మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు తాజాగా లాంచ్ కానున్న హ్యుండాయ్ క్రెట్ కొత్త వేరియంట్ మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇండోనేషియాలో ఈ కారును కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఈ కొత్త క్రెటాలో ఎన్నో మార్పులు చేశారు.


ఈ కారు లుక్ కూడా ఎంతో మారిపోయింది. టస్కన్ తరహా ఫ్రంట్ ఎండ్‌ను కొత్త క్రెటాలో అందించారు. పారామెట్రిక్ గ్రిల్ కూడా ఇందులో ఉంది. మిగతా ఎస్‌యూవీల తరహాలోనే దీని హెడ్ ల్యాంప్స్ కూడా కొంచెం కిందకు ఉన్నాయి. ముందువైపు కింద భాగంలో బంపర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో పాటు కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.


కారు పక్కభాగాల్లో మార్పులు తక్కువగానే చేశారు. అయితే వీల్ డిజైనింగ్ కొంచెం కొత్తగా ఉంది. కారు వెనకవైపు చక్రాలను కూడా స్పోర్ట్స్ లుక్ ఉండేలా డిజైన్ చేశారు. వెనకవైపు కొత్త డిజైన్ ఉన్న బంపర్‌ను అందించారు. అయితే కారు ముందువైపు మాత్రం చూపరులను బాగా ఆకట్టుకుంటోంది.


ఇందులో అల్కజర్ తరహాలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. డ్రైవ్ మోడ్స్‌కు తగ్గట్లు డిస్‌ప్లే స్క్రీన్ కలర్ మారుతుంది. దీంతోపాటు పనోరమిక్ సన్ రూఫ్ కూడా ఇందులో ఉంది. హ్యుండాయ్ బ్లూ లింక్ లేటెస్ట్ వెర్షన్ ఇందులో అందించారు. ఇందులో బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, క్రాస్ ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


అయితే ఇంజిన్ ఆప్షన్లలో మాత్రం ఎటువంటి మార్పులూ లేవు. 1.5 లీటర్ పెట్రోల్ విత్ సీవీటీ, మాన్యువల్ ఆప్షన్లు, 1.4 లీటర్ టర్బో విత్ డీసీటీ గేర్ బాక్స్, 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రెటా కంటే త్వరలో లాంచ్ కానున్న క్రెటా వేరియంట్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి కాబట్టి.. ఆ ధరకు న్యాయం చేస్తారని అనుకోవచ్చు.


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి