India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తిట్టించుకున్న పాక్

ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు మరోసారి భారత్ దీటుగా బదులిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది.

Continues below advertisement

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు మరోసారి గట్టి బదులిచ్చింది భారత్. ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ వాదనను తిప్పికొట్టింది. సీమాంత ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది.

Continues below advertisement

పాకిస్థాన్ తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, శిక్షణ, మద్దతు ఇస్తుందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఐరాసలోని భారత శాశ్వత మిషిన్‌లోని కౌన్సిలర్ డాక్టర్ కాజల్ భట్ అన్నారు.

పాకిస్థాన్ సరిహద్దు దేశాలతో సత్సబంధాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. సిమ్లా, లాహోర్ ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఉగ్రవాదం, హింసను వారు విడనాడితేనే భారత్ చర్చలకు వస్తుంది. భారత్ వ్యతిరేక ప్రచారానికి ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తున్నారు. పాక్‌లో మైనార్టీలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వాటి నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకే పాక్ ఇలా చేస్తోంది.                                   -  డాక్టర్ కాజల్ భట్, ఐరాసలో భారత్ ప్రతినిధి

ముందు ఖాళీ చేయండి..

జమ్ముకశ్మీర్ ప్రాంతానికే చెందిన కాజల్ భట్.. పాకిస్థాన్‌కు మరో అంశంపైనా భారత్ వైఖరిని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ పూర్తిగా భారత్‌లో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాలు కూడా భారత్‌ భూభాగంలోకే వస్తాయి. కనుక భారత్ పూర్తి భూభాగం నుంచి పాకిస్థాన్ వైదొలగాలని మేం డిమాండ్ చేస్తున్నాం.                                 - డాక్టర్ కాజల్ భట్, ఐరాసలో భారత్ ప్రతినిధి

Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'

Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం

Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...

Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...

Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola