ఫోర్డ్ ఇండియా మనదేశం నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో పెద్ద ఎస్‌యూవీల మధ్య యుద్ధం ఫార్ట్యూనర్, గ్లోస్టర్‌లకే పరిమితం అయింది. మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీలు ఎన్ని వస్తున్నా.. పెద్ద ఎస్‌యూవీలు మాత్రం ఇవి రెండే. వీటిని లాంగ్ జర్నీల కోసం డిజైన్ చేశారు. అలాగే నగరంలో డ్రైవ్ చేయడానికి కూడా ఇవి సరిగ్గా సరిపోతాయి. 


రెండు పెద్ద వాహనాలను పోల్చేటప్పుడు.. వాటి సైజు ఎంత ఉందనేది కచ్చితంగా చూడాల్సిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల్లో వీటి సైజును ఏవీ మ్యాచ్ చేయలేవు. కేవలం రూ.కోట్లలో ఉన్న లగ్జరీ కార్లు మాత్రం మ్యాచ్ చేయగలవేమో. గ్లోస్టర్, ఫార్ట్యూనర్ రెండూ రోడ్డు మీద చాలా పెద్దగా కనిపిస్తాయి. అయితే గ్లోస్టర్ చూడటానికి ఫార్ట్యూనర్ కంటే కాస్త పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోస్టర్ సైజు కాస్త పెద్దగానే ఉంటుంది కాబట్టి. గ్లోస్టర్ చూడటానికి చాలా హెవీగా ఉంటుంది. దాని విండోలు కూడా కాస్త పెద్దగా ఉంటుంది. ఫార్ట్యూనర్ కంటే చూడటానికి కాస్త ప్రీమియంగా కూడా కనిపిస్తుంది.


ఫార్ట్యూనర్ కంటే స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. ఈ కొత్త ఫార్ట్యూనర్ కేబిన్ చూడటానికి ప్రీమియం లుక్‌తో ఉంది. దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో 10 స్పీకర్ జేబీఎల్ ఆడియో, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి. గ్లోస్టర్ కూడా ప్రీమియం టాన్ లుక్‌లోనే ఉన్నప్పటికీ.. క్యాబిన్ లుక్ సోసోగానే ఉంది. క్వాలిటీ, లుక్ కొంచెం మోడర్న్‌గా ఉంది. ఇందులో ఫ్యూచరిస్టిక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. మధ్యలో పెద్ద స్క్రీన్ కూడా ఉంది. ఇందులో ఫీచర్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఎయిర్ ప్యూరిఫయర్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్ హీటింగ్, మసాజ్, ఆటో పార్కింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.


ఈ రెండు ఎస్‌యూవీలను నగరంలో రోజువారీ వినియోగానికి కూడా ఉపయోగించుకోవచ్చు. గ్లోస్టర్‌లో చిన్న సైజు డీజిల్ ఇంజిన్ అందించారు. కాకపోతే ఇందులో ట్విన్ టర్బోలు ఉన్నాయి. దీని పవర్ అవుట్‌పుట్ 218 బీహెచ్‌పీ కాగా, టార్క్ 480 ఎన్ఎంగా ఉంది. గ్లోస్టర్ సైజు పెద్దది అయినప్పటికీ.. సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఆ విషయం గుర్తు రాదు. దీని స్టీరింగ్ చాలా లైట్‌గా ఉండనుంది. దీంతో పార్కింగ్ మరింత సులభంగా మారనుంది. అయితే ఫార్ట్యూనర్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడింది. దీని స్టీరింగ్ కాస్త హెవీగా ఉంది. దీంతో పార్కింగ్ చేయడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అయితే అప్‌డేట్ చేసిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంది. దీని బీహెచ్‌పీ 204గా ఉండగా, టార్క్ మాత్రం 500 ఎన్ఎంగా ఉంది.


నగరాల్లో తిరగడానికి గ్లోస్టర్‌ను కాస్త బెటర్‌గా రూపొందించారు. దీని రైడ్ క్వాలిటీ బెటర్‌గా ఉండగా.. తక్కువ బౌన్సీగా ఉండనుంది. అయితే ఫార్ట్యూనర్‌ను ఉపయోగించడం కాస్త హెవీగా ఉండనుంది. తక్కువ వేగంలో ప్రయాణించేటప్పుడు కాస్త బౌన్సీగా అనిపిస్తుంది. అయితే వేగం పెరిగే కొద్దీ ఇది మరింత స్మూత్‌గా మారనుంది.


గ్లోస్టర్ కాస్త సాఫ్ట్‌గా, పెద్దగా ఉంది కాబట్టి.. ఆఫ్ రోడ్ వెళ్లేటప్పుడు దీన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. రేంజ్ తక్కువగా ఉండటాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఆఫ్‌రోడర్ కంటే దీన్ని లగ్జరీ ఎస్‌యూవీగా పరిగణించాలి. ఇదే సమయంలో ఫార్ట్యూనర్ మాత్రం ఆఫ్ రోడింగ్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది.


గ్లోస్టర్ ధర రూ.30 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్‌ను బట్టి రూ.37.68 లక్షల వరకు ఉంది. ఇక ఫార్ట్యూనర్ ధర రూ.30 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు ఉంది. స్పేస్, కంఫర్ట్, హైవే ట్రిప్స్‌కు ఈజ్ ఆఫ్ యూజ్ ఫీచర్లు కావాలంటే గ్లోస్టర్‌ను ఎంచుకోవచ్చు. ఫార్ట్యూనర్ మాత్రం కాస్త రగ్గ్‌డ్‌గా ఉండనుంది. ఇందులో పవర్ ఫుల్ ఇంజిన్‌ను అందించారు. ఇవి రెండూ ఎస్‌యూవీలే అయినప్పటికీ.. వీటి ఫీచర్లు మాత్రం రెండు విధాలైన కస్టమర్లను ఆకర్షించేలా ఉన్నాయి కాబట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం సులభమే.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి