తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ స్టార్, కోవిడ్ సమయంలో పేదలను ఆదుకుని రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. మీరు హీరో అంటే మీరు హీరో ఒకరిని ఒకరు మొహమాట పెట్టుకున్నారు. అయితే ఇది జరిగింది సోషల్ మీడియాలో కాదు. ట్విట్టర్‌లోనే మరో చోటనే కాదు.. ప్రత్యక్షంగానే. వీరిద్దరూ హైదరాబాద్‌లో జరిగిన కోవిడ్‌-19 వారియర్స్‌కు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురూ పాల్గొన్నారు. 


Also Read : గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్


కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని కేటీఆర్ అభినందించారు. సేవతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారన్నారు.  సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, సోనూసూద్‌ వంటివారి చేయూత ఎంతైనా అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి విమర్శలు చేయడం చాలా సులువని కానీ సేవ చేయడమే కష్టమన్నారు.  సోనూ సూద్ రియల్ హీరో అని సోనూసూద్‌తో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్‌ ప్రకటించారు. 


Also Read: కేసీఆర్‌ని టచ్‌ చేసి బతికి బట్టకడతారా... రేపట్నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం.... 


మంత్రి కేటీఆర్ లాంటి వాళ్లు ఉంటే.. తన లాంటి వాళ్ల అవసరమే ఉండదని సోనూసూద్ వ్యాఖ్యానించారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని .... వాళ్లకు సహాయపడటమే మన ముందు ఉన్న పెద్ద సవాలు అని తెలిపారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు కనిపించిందన్నారు. ఆ వ్యవస్థ కేటీఆర్ ఆఫీస్ అని సోనుసూద్ గుర్తు చేశారు.


Also Read:  ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి


సోషల్ మీడియాలో తనకు వచ్చే విజ్ఞప్తులపైనా కేటీఆర్ చురుకుగా స్పందిస్తారు. కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ .. ఓ టీం ఈ అంశంలో చురుకుగా పని చేస్తూ ఉంటుంది. సాయం కోసం వచ్చే వారికి అప్పటికప్పుడు అందేలా చూస్తుంది. సోనుసూద్ ఇదే అంశాన్ని వివరించారు. అదే సమయంలో కేటీఆర్.. తము సోనుసూద్‌కు అండగా ఉంటామని.. సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తాడన్న భయంతోనే వేధింపులు ప్రారంభించారని.. తాము ఉండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి