బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాలు పూర్తై పదోవారంలోకి ఎంటరయ్యాడు ఇంటిసభ్యులు. ఈ వారం నామినేషన్లలో భాగంగా కెప్టెన్ యానీ నలుగురిని సెలెక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సన్నీ, మానస్, కాజల్, షణ్ముక్ ని యానీ మాస్టర్ జైల్లో పెట్టింది. ఇక బయట మిగిలిన సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే ఎవరు ముందుగా వెళ్లి తాళం తీసుకుంటారో వాళ్లు జైలు ఓపెన్ చేసి ఒకర్ని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వారు ఎవర్ని నామినేట్ చేస్తారో వారు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్ గా జైల్లో ఎవరు మిగులుతారో వారే నామినేషన్లో ఉంటారన్నమాట. ఆట మొదలవగానే మొదట తాళాలు పింకీ తీసుకుని మానస్ ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్... రవి, జెస్సీని నామినేట్ చేయడంతో వీళ్లిద్దరూ జైల్లోకి వెళ్లారు. ఆ తర్వాత తాళాలు దక్కించుకున్న సిరి...షణ్ముక్ కి సారీ చెప్పి జస్సీని బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జెస్సీ షణ్ముక్ ని సేవ్ చేయడంతో..షణ్ను..ప్రియాంకను నామినేట్ చేశాడు. ఎందుకని ప్రియాంక ప్రశ్నించడంతో తన కెప్టెన్సీలో ప్రాబ్లెమ్ ఫేస్ చేసింది పింకీతో అని చెప్పాడు. అందుకు తాను పనిష్మెంట్ తీసుకున్నా అని చెప్పింది. అయితే అక్కడున్న శ్రీరామ్, రవి, సిరిపై జీరో రీజన్స్ అన్న షణ్ముక్ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నాడు. దీనిపై ఫైర్ అయిన పింకీ మరోసారి ప్రోపర్ రీజన్ ఇచ్చి నామినేట్ చేయమని చెప్పింది. మొత్తానికి గడిచిన వారాలతో పోలిస్తే ఈ వారం నామినేషన్లు కాస్త డిఫరెంట్ గానే సాగినట్టుంది.
ఇప్పటివరకూ ఇంటి నుంచి తొమ్మది మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇంట్లో మిగిలిన వారు 10 మంది. వీరిలో యానీ మాస్టర్ కెప్టెన్ కావడంతో నామినేషన్ల నుంచి ఆమె సేఫ్. మిగిలిన తొమ్మిది మందిలో వీక్ కంటిస్టెంట్స్ విషయానికొస్తే ప్రియాంక, జెస్సీ కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ నామినేషన్లలో ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పదోవారం ఎలిమినేట్ కావడం పక్కా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తొమ్మిదోవారం ఎలిమినేట్ అయిన విశ్వ టాప్ 5 కంటిస్టెంట్స్ ని కరెక్ట్ గా గెస్ చేశాడంటున్నారు ప్రేక్షకులు. శ్రీరామచంద్ర, రవి, సిరి, షణ్ముక్, సన్నీ...ఈ ఐదుగురిని టాప్ 5 లో పెట్టాడు. ఇదే ఫైనల్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read: నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి