నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఆయనకు తొలి చిత్రమిది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు... సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఉన్నారు. వారిలో ఒకరితో నాని లిప్ లాక్ సీన్ చేశారు. అది టీజర్‌లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, సినిమా గ్రాండియర్ కనిపించేలా టీజర్ విజువల్స్ కట్ చేశారని తెలిసింది. లిప్ లాక్ ఎవరితో అంటే... 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టితో! అవును... నాని, కృతి మధ్య 'శ్యామ్ సింగ రాయ్'లో ఓ లిప్ లాక్ ఉంది. అది ముద్దే కానీ దాని వెనుక పెద్ద కథ ఉందట. సినిమా విడుదల సమయంలో ఆ కథను నాని చెప్పవచ్చు. టీజర్‌లో ఆ లిప్ లాక్ సీన్ ఉండొచ్చు.


నాని కెరీర్‌లో 'శ్యామ్ సింగ రాయ్' భారీ బడ్జెట్ ఫిల్మ్. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్‌ చేశారు. సత్యదేవ్ జంగా అందించిన కథతో రూపొందిన ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలకూ యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
Also Read:  పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..

Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి