RRR & NTR : భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?

కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ నెల 9న ట్రైలర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు.

Continues below advertisement

భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన లుక్ విడుదల చేశారు. టీజర్ చూపించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా... అడవిలో పులితో యుద్ధం చేసే వీరుడిగా ఎన్టీఆర్ అభినయం, ఆహార్యం ప్రేక్షకులకు నచ్చాయి. అయితే... ఇప్పుడు కొత్తగా కొమరం భీమ్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ నెల 9న సినిమా ట్రైలర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పోస్టర్ కానుక అన్నమాట.

Continues below advertisement

ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూస్తే... అడవిలో పోరాటం చేసేటప్పుడు సన్నివేశంలోది అని తెలుస్తోంది. ఈ రోజు (డిసెంబర్ 6, సోమవారం సాయంత్రం) నాలుగు గంటలకు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ విడుదల చేయనున్నారు.

'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా ఆలీయా భట్ నటించారు. ఆల్రెడీ విడుదలైన 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.

Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన స‌మ‌స్య‌... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement