ఆయుర్వేద శాస్త్రంలో సరస్వతి మొక్కది ప్రత్యేక స్థానం. ఈ ఆకుల రసాన్ని ఎన్నో మందుల తయారీలో వినియోగిస్తారు. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన మొక్క సరస్వతి మొక్క. ఇవి చూడటానికి కూడా అందంగా ఉంటాయి కనుక, చిన్న కుండీలో పెంచుకోవచ్చు. దీని వల్ల ఎన్ని లాభాల్లో కలుగుతాయో తెలిస్తే మీరే కొని తెచ్చుకుంటారు.
1. సరస్వతి మొక్క అనగానే మీకు అర్థమైపోయుండాలి, ఇది తెలివితేటలను, జ్ఞాపకశక్తిని పెంచుతుందని. రోజూ నాలుగు ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. తద్వారా ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకు కూడా దీన్ని తినిపించవచ్చు. అయితే వాళ్లు ఆకులు నమలమంటే ఇష్టపడరు, కాబట్టి ఆకుల నుంచి రసాన్ని తీసి తాగించండి.
2. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని కొద్దికొద్దిగా తాగిస్తే మంచిదని చెబుతోంది ఆయుర్వేదం.
3. ఈ ఆకుల రసం తాగడం వల్ల రక్తం కూడా శుభ్ర పడుతుందని, రక్త హీనత సమస్య కూడా త్వరలోనే తగ్గుముఖం పడుతుందని కూడా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
4. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆకుల రసంలో కాస్త వామును కలిపి మెత్తని పేస్టులా చేసుకుని తినేయాలి. చెడు కొవ్వు కరిగిపోతుంది.
5. మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, అధిక ఒత్తిడికి గురవుతున్నవారు రోజూ నాలుగు ఆకులను నమిలి తినడం అలవాటు చేసుకోవాలి.
6. వీటితో జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా ఇది చదువుకునే పిల్లలకు అవసరం. ఈ ఆకులను ఎండలో కాకుండా ఇంట్లోనే ఆరబెట్టి, ఆ ఆకులు, బాదంపప్పులు,మిరియాలు, వేడి నీరు కొంచెం పోసి బాగా పేస్టు చేయాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి, వచ్చే నీటిలో కాస్త తేనె కలిపి పిల్లలచేత తాగించాలి. ఇలా రోజూ చేస్తుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే నత్తి ఉన్న పిల్లలకు మాటలో స్పష్టత వస్తుంది.
7. రోజూ సరస్వతి మొక్క నాలుగు ఆకులను తినడం అలవాటు చేసుకుంటే చాలా వ్యాధులు దరిచేరవు.
సరస్వతి మొక్కలు నర్సరీలో, ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ధర కూడా అంత ఎక్కువగా ఉండదు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
Read Also: అబద్ధాలకోరును ఇలా గుర్తించండి... మోసపోకుండా జాగ్రత్త పడండి
Read Also: వాషింగ్ మెషీన్లతో పిరమిడ్... ఎన్ని వాషింగ్ మెషీన్లు వాడారో తెలుసా?
Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి